Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
Travel Bus | బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travel Bus) అగ్నికి (Fire Accident) ఆహుతయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది.
Andhra pradesh | Published On Sep 4, 2026, 8.51 am IST
Travel Bus | త్రినేత్ర.న్యూస్: బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travel Bus) అగ్నికి (Fire Accident) ఆహుతయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది.
33 మంది ప్రయాణికులతో వింటర్సిటీ సర్వీసెస్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Ananthapuram) జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో బస్సులో పొగలు వస్తుడటాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యారు.

వెంటనే బస్సును నిలిపి అందులో నుంచి ప్రయాణికులను దించేశారు. వారంతా దిగిన వెంటనే.. బస్సు మొత్తం దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంత జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వింటర్ సిటీ సర్వీసెస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా… pic.twitter.com/eSHfYXjnOj
— greatandhra (@greatandhranews) September 4, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు





