త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Open Top Double Decker Buses | హైద‌రాబాద్ రోడ్ల‌పైకి ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు

Open Top Double Decker Buses | హైద‌రాబాద్ రోడ్ల‌పై మ‌రోసారి ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు సందడి చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు న‌గ‌ర రోడ్ల‌పై తిరుగుతుండ‌గా.. వాటి జాబితాలో మ‌రో రెండు చేర‌నున్నాయి.

S

Hyderabad | Published On Sep 22, 2026, 7.05 pm IST

Open Top Double Decker Buses | హైద‌రాబాద్ రోడ్ల‌పైకి ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు
Advertisement

Open Top Double Decker Buses | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ రోడ్ల‌పై మ‌రోసారి ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు సందడి చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు న‌గ‌ర రోడ్ల‌పై తిరుగుతుండ‌గా.. వాటి జాబితాలో మ‌రో రెండు చేర‌నున్నాయి. ఈ రెండు బ‌స్సులు కూడా ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు. న‌గ‌రంలోని చారిత్ర‌క‌, ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు టూరిస్టుల‌ను తీసుకెళ్లేందుకు వినియోగించ‌నున్నారు. ఈ రెండు ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్( TGTDC ) ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నున్నాయి.

ఓపెన్ టాప్ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే విధంగా ఉన్నాయి. బ‌స్సు పైభాగం పూర్తిగా ఓపెన్‌గా ఉంటుంది. బ‌స్సు కింది భాగం మొత్తం ఎయిర్ కండిష‌న్డ్‌గా తీర్చిదిద్దారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఈ బస్సులలో జీపీఎస్ (GPS), సీసీటీవీ (CCTV) కెమెరాలు, ప్రయాణ విశేషాలను వివరించేందుకు ప్రత్యేక గైడ్ సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఇక ఇప్ప‌టికే న‌గ‌రంలో ఆరు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప‌రుగులు పెడుతున్నాయి. ఈ బ‌స్సులు హెచ్ఎండీఏ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. న‌గ‌రంలోని ప‌ర్యాట‌క ప్రాంతాలైన గొల్కోండ‌, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌తో పాటు ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లోని వేవ్ రాక్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో న‌డుస్తున్నాయి. ఒక్కో బ‌స్సులో 65 మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణించే వీలుంది. ఈ ఆరు బ‌స్సుల‌ను కూడా టీజీటీడీసీకి బ‌దిలీ చేయాల‌ని హెచ్ఎండీఏను ఇటీవ‌ల కోరారు. ఈ ప్ర‌క్రియ కూడా త్వ‌ర‌లోనే పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప‌ర్యాట‌క శాఖ వెల్ల‌డించింది.

Advertisement
Advertisement