త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Private Travels | పేలిన టైరు.. మంట‌లంటుకుని ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు స‌జీవ ద‌హ‌నం

Private Travels | ఆంధ్ర‌ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బ‌స్సు (Private Travels) టైరు పేల‌డంతో అదుపుత‌ప్పి డివైడ‌ర్ దాటి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టింది.

G

Andhra pradesh | Published On Jan 22, 2026, 9.47 am IST

Private Travels | పేలిన టైరు.. మంట‌లంటుకుని ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు స‌జీవ ద‌హ‌నం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బ‌స్సు (Private Travels) టైరు పేల‌డంతో అదుపుత‌ప్పి డివైడ‌ర్ దాటి ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బ‌స్సులో మంట‌లు ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో, ప్ర‌యాణికులంతా మంచి నిద్ర‌లో ఉన్నపుడు జ‌రిగిన‌ ఈ ప్ర‌మాదంలో ముగ్గురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

ఏఆర్‌బీ సీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బ‌స్సు నెల్లూరు నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న‌ది. బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన త‌ర్వాత‌ నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద.. టైరు పేలడంతో బ‌స్సుపై డ్రైవ‌ర్ అదుపుకోల్పోయాడు. డివైడర్‌ దాటి అవ‌త‌లివైపు వెళ్లిన బ‌స్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది. దీంతో బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఆ త‌ర్వాత లారీకి కూడా విస్త‌రించారు. దీంతో రెండు వాహ‌నాలు కాలిబూడిద‌య్యాయి.

అయితే అదేస‌మ‌యంలో అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవ‌ర్ త‌న వాహ‌నాన్ని ఆపి.. బ‌స్సు అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్ట‌డంతో ప్ర‌యాణికులు బ‌య‌ట‌ప‌డ్డారు. కిటికీల్లోంచి దూకడంతో ప‌ది మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్‌ మృతిచెందారు. ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల ద‌వాఖాన‌కు తరలించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement