త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | కొడంగ‌ల్‌, అచ్చంపేట‌లో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు రెండు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఓట‌రు జాబితాలో న‌మోదై ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అచ్చంపేట అసెంబ్లీలోనూ ఆయన పేరుతో ఓటు ఉన్నట్లు రికార్డులు బయటపడ్డాయి.

G

Telangana | Published On Jul 14, 2026, 7.17 am IST

Revanth Reddy | కొడంగ‌ల్‌, అచ్చంపేట‌లో.. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు.. SIRతో వెలుగులోకి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఒక వ్య‌క్తికి రెండు చోట్ల ఓటు (vote) ఉండ‌టం నేరం. సాధార‌ణంగా కొంద‌రు ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో ఓట్లు క‌లిగి ఉంటారు. మ‌రికొంద‌రు ఏపీ, తెలంగాణ‌లో (Telangana) త‌మ ఓట్లు న‌మోదుచేసుకుంటూ ఉంటారు. అదే ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి, 20 ఏండ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్నవారు కూడా రెండు ఒకే జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటు హ‌క్కు క‌లిగి ఉంటే?.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓట‌ర్ల జాబిబాతా ఒడ‌బోత‌లో ఇదే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు రెండు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఓట‌రు జాబితాలో న‌మోదై ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అచ్చంపేట అసెంబ్లీలోనూ ఆయన పేరుతో ఓటు ఉన్నట్లు రికార్డులు బయటపడ్డాయి. రెండు చోట్లా ఒకే ఎపిక్ (EPIC) నంబర్ (TES0274035) ఉండటం గమనార్హం. అయితే Anumula Revanth Reddy అనికాకుండా Anumula Revant Reddy అని త‌ప్పుగా న‌మోదైంది. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో బ‌య‌ట‌ప‌డింది. కాగా, 'ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950' ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదు కావడానికి అర్హుడు కాదు.

అయితే రెండు చోట్ల ఓటు ఉండటం చట్టరీత్యా నేరం అని, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఉంచుకుంటే జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇటీవ‌లే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) హెచ్చరించిన విష‌యం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి ఓటు తొలగింపుపై రాజకీయంగా చర్చజ‌రుగుతున్న‌ది.

రెండు చోట్ల ఓటు ఉంటే జైలుకే..

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు హక్కు ఉండాలని, అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని రాష్ట్ర‌ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి రెండు చోట్ల ఓటు హక్కు పొందితే, అలాంటి వారికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. ఎవరికైనా రెండు చోట్ల ఓట్లు ఉంటే తాము సులభంగా గుర్తిస్తామని, ఒకవేళ వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకొచ్చిన 'డెమోగ్రాఫికల్లీ సిమిలర్‌ ఎంట్రీస్‌' (డీసీఈ) అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రికైనా మినహాయింపు లేదు..

ఓటర్ల జాబితాను శుద్ధి చేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో సాధారణ పౌరుల నుంచి సీఎం, పీఎం వరకు ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్‌ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. బీఎల్‌వోలు ఇచ్చే రెండు ఫారాలలో ఒకదాన్ని నింపి ఇవ్వాలని, అలా ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు.

 

Advertisement
Advertisement