త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?

నెలకు లక్ష రూపాయల జీతం అనేది కల. కానీ, 2026లో ఇదే అత్యంత ప్రమాదకరమైన జీతం అని ఓ మహిళ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా?

J

Viral news | Published On Jul 14, 2026, 1.00 am IST

Dangerous Salary 2026 | నెలకు లక్ష సంపాదిస్తున్నారా? ఆ జీతం చాలా డేజంర్ అంటున్న యువతి.. ఎందుకో తెలుసా?
Advertisement
  • నెలకు రూ.1 లక్ష జీతం అత్యంత 'ప్రమాదకరం' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి కుష్వాహా అనే కంటెంట్ క్రియేటర్ వీడియో వైరల్
  • ఈ జీతం వస్తే అన్నీ సమకూరుతాయని, దాంతో జీవితంలో కొత్తగా సాధించాలనే కోరిక చచ్చిపోతుందని ఆమె వాదన
  • ఒకసారి 'లైఫ్ సెట్' అయిందనే ఫీలింగ్ వస్తే కెరీర్ గ్రోత్ ఆగిపోతుందన్నది ఆమె ఉద్దేశం
  • జీవితంలో ఎదగడం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు

Dangerous Salary 2026 | త్రినేత్ర.న్యూస్ : నెలకు లక్ష రూపాయల జీతం (Rs one lakh salary) రావడం అంటే ఏ ఉద్యోగికైనా, సగటు జీవికైనా ఓ పెద్ద కల. ఎందుకంటే ఆ జీతంతో ఖర్చులు, ఈఎంఐలు (EMIs) కట్టుకుంటూనే అప్పుడప్పుడు కొన్ని లగ్జరీలు ఎంజాయ్ చేయొచ్చు. అయితే, 2026 సంవత్సరంలో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం అత్యంత 'ప్రమాదకరమైన జీతం' అని నిధి కుష్వాహా అనే ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద డిబేట్‌కు (Debate) దారితీశాయి.

ఎందుకు ప్రమాదకరం?

ఆ జీతం తక్కువ కాబట్టి ప్రమాదకరం కాదు.. అది మనిషికి మరీ ఎక్కువ కంఫర్ట్ (Comfort) ఇచ్చి, జీవితంలో ఇంకా ఎదగాలనే ఆశను చంపేస్తుంది కాబట్టే ప్రమాదకరం అని నిధి వాదిస్తున్నారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆమె ఈ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. "లక్ష రూపాయల జీతం అనేది మీ బేసిక్ నీడ్స్ (Basic needs) అంటే ఇంటి అద్దె, వీకెండ్ డిన్నర్స్, ఏడాదికి ఒకటీ రెండు వెకేషన్లు (Vacations) వెళ్లడానికి సరిపోతుంది. కరెక్ట్‌గా ఇక్కడే అసలు ట్రాప్ ఉంది" అని ఆమె వివరించారు.

ఆగిపోయే కెరీర్ గ్రోత్

నెలకు లక్ష రూపాయలు రావడం మొదలైతే, మనుషులు ఆ కంఫర్ట్ జోన్‌కు (Comfort zone) అలవాటు పడిపోయి కొత్త అవకాశాలను వెతకడం మానేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కెరీర్‌లో పెద్ద రిస్క్‌లు తీసుకోవడానికి వెనకడుగు వేస్తారని చెప్పారు.

"మీకు అన్నీ ఉన్నాయని అనిపించినప్పుడు, 'నాకు ఇంకా ఎందుకు కావాలి?' అని మీ బ్రెయిన్ ప్రశ్నించడం మానేస్తుంది. నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్న రోజే, మీకు తెలియకుండానే మీ గ్రోత్ ఆగిపోతుంది" అని నిధి కుష్వాహా చెప్పుకొచ్చారు.

సమర్థత లేకపోవడం వల్ల కాకుండా, కంఫర్ట్ జోన్‌ను వదలలేకనే చాలామంది ఏళ్ల తరబడి ఒకే పొజిషన్‌లో ఉండిపోతున్నారని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నిధి వాదనతో వంద శాతం ఏకీభవిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

"మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం," అని ఒకరు కామెంట్ చేయగా..

"లైఫ్‌లో ఎదగడం అంటే ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తడం మాత్రమే కాదు," అని మరొక నెటిజన్ కౌంటర్ ఇచ్చారు.

"మరి నెలకు రూ.10 లక్షలు వస్తే పరిస్థితి ఏంటి?" అన్న మరో యూజర్ ప్రశ్నకు.. "నంబర్ ముఖ్యం కాదు, మన మైండ్‌సెట్ (Mindset) ముఖ్యం" అని నిధి బదులిచ్చారు.

Advertisement
Advertisement