Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలో ఓ లారీని కారు ఢీకొట్టింది.
Andhra pradesh | Published On Jul 19, 2026, 8.50 am IST
Road Accident | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలో ఓ లారీని కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబం కారులో వెళ్తున్నది. ఈ క్రమంలో కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో డ్రైవర్ సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని విశాఖలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
విశాఖ:
పెందుర్తి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
తెల్లవారుజామున అదుపుతప్పి లారీని ఢీ కొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి
మృతి చెందిన వారిలో వినుకొండ ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ కుమారుడు
తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే పి ఎ చంద్రశేఖర్ ను విశాఖలోని ఆసుపత్రికి తరలించిన… pic.twitter.com/TaKWPhigPK
— Vizag News Man (@VizagNewsman) July 19, 2026
సంబంధిత వార్తలు

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
సెప్టెంబర్ 20, 2026

Volvo Car | సూర్యాపేటలో వోల్వో కారులో మంటలు.. వైద్యుడు సజీవదహనం
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్

UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్ను కాల్చి చంపాడు



