త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌తో చంద్రబాబు భేటీ

ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ నేతలతో కలిసి నితిన్ నబిన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

J

Andhra pradesh | Published On Dec 19, 2025, 4.01 pm IST

Nitin Nabin | బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌తో చంద్రబాబు భేటీ
Advertisement

Nitin Nabin | బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వంలో పలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీ చీఫ్‌గా ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆ పదవి నుంచి తప్పించి ఆ ప్లేస్‌ కోసం బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి నితిన్ నబిన్‌ను ఎంపిక చేసింది. అయితే.. బీజేపీ హైకమాండ్ ఆ పదవిలో డైరెక్ట్‌గా నితిన్‌ని కూర్చోబెట్టకుండా ప్రస్తుతానికి ఆయన్ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా నియమించింది. దీంతో ఆయన్ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర టీడీపీ నేతలతో కలిసి నితిన్ నబిన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయనకు పుచ్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం కాసేపు నితిన్‌తో భేటీ అయి దేశ, ఏపీ రాజకీయాలపై చర్చించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement