త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!

సేఫ్టీ లేదని అధికారులు క్లోజ్ చేసిన రూ.26 కోట్ల బ్రిడ్జిపై ఏకంగా డీజేలతో బర్త్‌డే పార్టీ చేసుకుందో బిహార్ ఫ్యామిలీ. ఆ వైరల్ వీడియోపై కేసు నమోదైంది.

J

Viral news | Published On Jul 16, 2026, 7.33 pm IST

Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!

సంక్షిప్త సారాంశం

బిహార్‌లోని బక్సర్-ఇటార్హీ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఓ కుటుంబం ఘనంగా బర్త్‌డే పార్టీ (Birthday party) జరుపుకుంది. నిర్మాణ లోపాల కారణంగా జూన్ 5 నుంచే పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా ఈ రూ. 26.4 కోట్ల బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. నిషేధం ఉన్నప్పటికీ డీజేలు, డ్యాన్సులతో పార్టీ చేసుకోవడం, ఈ వీడియోలు వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పార్టీ ఆర్గనైజర్ రాకేశ్ కుమార్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.

Advertisement

Bihar Bridge Birthday Party | త్రినేత్ర.న్యూస్ : బిహార్‌లో (Bihar) వింతలకేం కొదవలేదు. ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు కోట్లు ఖర్చుపెట్టి కట్టిన ఓ బ్రిడ్జిని మూసివేస్తే.. దాన్ని ఒక కుటుంబం తమ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌గా మార్చేసుకుంది. ఏకంగా డీజేలు, భారీ లైటింగ్, డ్యాన్సులతో స్టేజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి బర్త్‌డే పార్టీ (Birthday party) చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో పోలీసుల దాకా విషయం వెళ్లింది.

90 రోజుల్లోనే మూసివేత

బిహార్‌లోని బక్సర్-ఇటార్హీ (Buxar-Itarhi) వద్ద రూ. 26.4 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిర్మించారు. అయితే, అంగరంగ వైభవంగా ప్రారంభించిన కేవలం 90 రోజుల్లోనే ఇందులో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. దీంతో పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా జూన్ 5న అధికారులు ఈ బ్రిడ్జిని మూసివేశారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.

బ్రిడ్జిపై బర్త్‌డే సెలబ్రేషన్స్

బ్రిడ్జిని క్లోజ్ చేసినప్పటికీ జులై 11న కొందరు వ్యక్తులు అక్కడ గుమికూడారు. ఏకంగా ఓ స్టేజ్ ఏర్పాటు చేసి, లౌడ్ మ్యూజిక్ (Loud music), డ్యాన్సులతో ఓ రేంజ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ సేఫ్టీ లేదని మూసివేసిన బ్రిడ్జిపైకి అసలు వీళ్లంతా ఎలా వెళ్లారు? ఇంత పెద్ద పార్టీ జరుగుతున్నా అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆర్గనైజర్‌పై ఎఫ్ఐఆర్ (FIR)

ఈ వ్యవహారంపై బక్సర్ ఎస్పీ (Superintendent of Police) శుభమ్ ఆర్య స్పందించారు. బ్రిడ్జిపై నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ రాకేశ్ కుమార్ సింగ్‌ను గుర్తించామని, అతనిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. భద్రతా వైఫల్యాలపై కూడా పోలీసు శాఖ దృష్టి సారించింది. నిషేధిత ప్రాంతంలోకి వారు ఎలా ప్రవేశించారనే దానిపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement
Advertisement