TG Weather | తెలంగాణలో వేడి, ఉక్కపోత.. రేపు ఈ జిల్లాల్లో వానలు..
TG Weather | జూలై మాసం సగం గడిచినా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాల బలహీనంగా మారడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఒకవైపు వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులుపడుతున్నారు.
TG Weather | జూలై మాసం సగం గడిచినా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాల బలహీనంగా మారడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఒకవైపు వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులుపడుతున్నారు. రాబోయే రోజుల్లోనే ఇదే తరహా పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ప్రభావం కనిపించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే చాలా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 22 వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, విస్తారంగా భారీ వర్షాలు కురిసే సూచనలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం సైతం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
సంబంధిత వార్తలు

Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జులై 16, 2026

Adinath Kothare | 15 ఏళ్ల దాంపత్యానికి తెర.. విడాకులు తీసుకున్న రామాయణ నటుడు..!
జులై 16, 2026

Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
జులై 16, 2026
తాజావార్తలు
- ●DGP Anand | సైబర్ ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయ్.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది
- ●Uttam Kumar Reddy | ప్రాణహితకు మళ్లీ ప్రాణం.. శాస్త్రీయంగానే కాళేశ్వరం పునరుద్ధరణ
- ●ISRO Scientists Resign | ఇస్రోకు భారీ షాక్: 100 మంది సైంటిస్టుల రాజీనామా.. 'గగన్‌యాన్' వేళ కేంద్రం కీలక నిర్ణయం!
- ●Tollywood | ఈ వారం థియేటర్లలో ఒక్క రోజే ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్ - సీనియర్లు హిట్టు కొడతారా?
- ●Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ●Dharwad Murder Case | నెత్తురోడుతున్న భర్త శవం.. చావుబతుకుల్లో కొడుకు: ఫోన్ చూసుకుంటూ భార్య! కళ్లు చెదిరే క్రైమ్ స్టోరీ

DGP Anand | సైబర్ ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయ్.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది

Uttam Kumar Reddy | ప్రాణహితకు మళ్లీ ప్రాణం.. శాస్త్రీయంగానే కాళేశ్వరం పునరుద్ధరణ

ISRO Scientists Resign | ఇస్రోకు భారీ షాక్: 100 మంది సైంటిస్టుల రాజీనామా.. 'గగన్‌యాన్' వేళ కేంద్రం కీలక నిర్ణయం!

Tollywood | ఈ వారం థియేటర్లలో ఒక్క రోజే ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్ - సీనియర్లు హిట్టు కొడతారా?



