Tollywood | ఈ వారం థియేటర్లలో ఒక్క రోజే ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్ – సీనియర్లు హిట్టు కొడతారా?
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి తన అదృష్టాన్నీ పరీక్షించుకోబోతున్నారు.
Naresh N
Entertainment | Published On Jul 16, 2026, 6.40 pm IST

శ్రీకాంత్, లయ జంటగా నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించారు. పలువురు టాలీవుడ్ కమెడియన్లు కీలక పాత్రల్లో కనిపించారు.

జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన వదలా మూవీకి వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. హీరోగా జగపతిబాబుకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

టీవీ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దినేష్ కుమార్ హీరోగా నటించాడు. హీరోయిన్‌గా దివిజ ప్రభాకర్‌కు తొలి మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది శుక్రవారం తేలనుంది.

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఓ సుకుమారి ఈ వారమే థియేటర్లలోకి వచ్చేస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు భరత్ భూషణ్ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత ఐశ్వర్య రాజేష్ చేసిన సినిమా ఇది. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో ఓ సుకుమారిపైనే మోస్తారు అంచనాలు నెలకొన్నాయి.

ఆపరేషన్ అరుణా రెడ్డి మూవీతో చాలా రోజుల తర్వాత సీనియర్ రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి మెగా ఫోన్ పట్టారు. ఇందులో ఆయనే ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బీజేపీ ఎంపీ రఘునందన్ అతిథి పాత్రలో నటించారు.

ఈ నాలుగు సినిమాలతో పాటు ఎమ్ఆర్‌పీ, రాజా ది రాజా, ఒక కోర్ట్ కేసు ఈ సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
తాజావార్తలు
- ●Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ●Dharwad Murder Case | నెత్తురోడుతున్న భర్త శవం.. చావుబతుకుల్లో కొడుకు: ఫోన్ చూసుకుంటూ భార్య! కళ్లు చెదిరే క్రైమ్ స్టోరీ
- ●KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
- ●Telangana | మేడమ్.. 700 మంది అమ్మాయిలకు రెండే టాయిలెట్లు.. ఇదీ గిరిజన బాలికల ఆవేదన
- ●Harish Rao | అప్రకటిత కరెంట్ కోతలతో.. తెలంగాణలో అంధకారం
- ●Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు

Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

Dharwad Murder Case | నెత్తురోడుతున్న భర్త శవం.. చావుబతుకుల్లో కొడుకు: ఫోన్ చూసుకుంటూ భార్య! కళ్లు చెదిరే క్రైమ్ స్టోరీ

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం

Telangana | మేడమ్.. 700 మంది అమ్మాయిలకు రెండే టాయిలెట్లు.. ఇదీ గిరిజన బాలికల ఆవేదన


