త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | పెద్ది తెలంగాణ‌లో షాక్‌.. ధ‌ర‌ల పెంపును నో చెప్పిన హైకోర్టు..!

Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ పెద్ది. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ మూవీకి తెలంగాణ‌లో ఎదురుదెబ్బ త‌గిలింది. తొలివారం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేసింది.

P

Entertainment | Published On May 30, 2026, 7.28 pm IST

Peddi Movie | పెద్ది తెలంగాణ‌లో షాక్‌.. ధ‌ర‌ల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
Advertisement

Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ పెద్ది. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ మూవీకి తెలంగాణ‌లో ఎదురుదెబ్బ త‌గిలింది. తొలివారం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేసింది. అత్య‌వ‌స‌ర పిటిష‌న్‌ను ప‌రిశీలించి హైకోర్టు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఇచ్చేందుకు నిరాక‌రించింది. మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టికెట్ ధరల సవరణకు ముందస్తు అనుమతి కోసం చిత్ర బృందం తొలుత ప్రభుత్వ హోం శాఖను సంప్ర‌దించింది. అయితే, స్పష్టమైన స్పందన రాకపోవడంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టును ఆశ్రయించింది.

లంచ్ మోషన్ పిటిషన్‌గా దాఖలైన ఈ కేసు అత్యవసరంగా విచారణకు వచ్చినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ ధరలపై జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతంలో వచ్చిన తీర్పులు, సమాన కేసులను ప్రస్తావిస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. అయితే, విడుదల తేదీకి ముందు నిర్ణయం వెలువ‌క‌పోవ‌డం, విచారణ తేదీ సైతం రిలీజ్ తర్వాత రావడంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించిన నిర్మాతల తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు.

ఈ పరిణామం తెలుగు సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి వారం టికెట్ ధరల పెంపు కీల‌కంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం నిర్మాతలకు కొంత నిరాశ కలిగించినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేటర్ యజమానులు కూడా విడుదల సమయానికి స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆసక్తికరంగా ఏపీలో మాత్రం ‘పెద్ది’ సినిమాకు ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే టికెట్ ధరల పెంపునకు అనుమతులు లభించడం గమనార్హం. రిలీజ్‌కు కొద్దిరోజులే స‌మ‌యం ఉండ‌డంతో ‘పెద్ది’ చుట్టూ నెల‌కొన్న ప‌రిణామాలు సినిమా వ‌సూళ్ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది.

Advertisement
Advertisement