త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manali Cost Of Living | మనాలిలో నెలకు రూ.5 వేల అద్దె, 300 కరెంట్ బిల్లు: పర్వతాల్లో ‘రిమోట్ వర్క్’ చేస్తున్న జంట బడ్జెట్ చూస్తే షాకే!

హిమాలయాల్లో బతకాలంటే లక్షలు కావాలా? కేవలం రూ.12 వేల బడ్జెట్‌తో మనాలిలో ఎంజాయ్ చేస్తున్న ఓ జంట స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. వారి ఖర్చుల చిట్టా మీకోసం!

J

Viral news | Published On Jun 19, 2026, 4.00 am IST

Manali Cost Of Living | మనాలిలో నెలకు రూ.5 వేల అద్దె, 300 కరెంట్ బిల్లు: పర్వతాల్లో ‘రిమోట్ వర్క్’ చేస్తున్న జంట బడ్జెట్ చూస్తే షాకే!
Advertisement
  • మనాలిలో రిమోట్ వర్క్ చేస్తూ జీవిస్తున్న ఓ జంట తమ నెలవారీ ఖర్చుల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది
  • అక్కడ 1 RK అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.5,000 అద్దె, కరెంట్ బిల్లు రూ.300 మాత్రమే వస్తుందని వెల్లడి
  • కిరాణా సరుకులు, ప్రయాణాలు అన్నీ కలుపుకుని తమ నెలవారీ బడ్జెట్ రూ.12,000 దాటదట
  • ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు.. కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు రవాణా ఖర్చులపై డౌట్స్ వ్యక్తం 

Manali Cost Of Living | త్రినేత్ర.న్యూస్ : మంచు పర్వతాల మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని ఎవరికి ఉండదు? కానీ హిమాలయాల్లో (Himalayas) జీవించాలంటే జేబులు ఖాళీ అవుతాయని చాలామంది భయపడతారు. అయితే, మనాలిలో (Manali) ఉంటూ రిమోట్ వర్క్ (Remote work) చేసుకుంటున్న ఓ జంట.. తమ నెలవారీ బడ్జెట్ కేవలం రూ. 12,000 మాత్రమేనని చెబుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అద్దె, కిరాణా, కరెంట్ బిల్లు ఇలా వారి పూర్తి ఖర్చుల చిట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వారి ఖర్చుల చిట్టా ఇదే..

'టూ వాగబాండ్ మాంక్స్' (Two Vagabond Monks) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని రన్ చేస్తున్న ఈ జంట తమ వీడియోలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. "మేము హిమాలయాల అందాల నడుమ ఒక అందమైన 1 RK (One Room Kitchen) అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. ఇందుకు నెలకు రూ. 5,000 మాత్రమే రెంట్ చెల్లిస్తున్నాం" అని వారు వివరించారు.

అయితే, ఇది ఫర్నిచర్ లేని ఇల్లు కావడంతో కావాల్సిన కనీస వస్తువులను తామే కొనుక్కున్నామని, ఫర్నిష్డ్ ఇళ్లకైతే లొకేషన్, వసతులను బట్టి ఎక్కువ ఖర్చవుతుందని క్లారిటీ ఇచ్చారు.

వీరి ఎలక్ట్రిసిటీ బిల్లు (Electricity bill) నెలకు రూ. 300 లోపే వస్తుందట. ఇక ఆహారం విషయానికొస్తే.. ఇంట్లోనే వండుకుంటారు కాబట్టి కిరాణా సరుకులకు (Groceries) నెలకు రూ. 4,000 ఖర్చవుతుంది. ఎప్పుడైనా కరెంట్ పోయినా, వండుకోవాలనిపించకపోయినా దగ్గర్లోని కేఫ్‌లు, రెస్టారెంట్లకు వెళ్తారు. దానికి నెలకు దాదాపు రూ. 1,500 వరకు బడ్జెట్ కేటాయించారు.

నడకే వారి మంత్రం

ఇద్దరూ రిమోట్ వర్క్ చేస్తుండటంతో వీరికి రోజువారీ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ (Travel expenses) పెద్దగా ఉండవు. ఎక్కడికైనా వెళ్లాలంటే నడిచి వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి నెలవారీ రవాణా ఖర్చులు రూ. 500 మించవట. ఇలా అత్యవసర ఖర్చులన్నీ కలుపుకున్నా.. తమ నెలవారీ బడ్జెట్ రూ. 12,000 లోపే ఉంటుందని ఈ జంట ధీమాగా చెబుతోంది.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్ (Mixed reactions) వస్తున్నాయి. కొందరు ఈ తక్కువ బడ్జెట్ చూసి ఫిదా అవుతున్నారు. "వీకెండ్‌ ట్రిప్‌కి మనాలి వెళ్లొస్తే అయ్యే ఖర్చుతో మీరు ఏకంగా నెలంతా బతికేస్తున్నారు" అని ఒకరు కామెంట్ చేశారు. మరికొందరు "ఇలాంటి సెటప్ వెతకడంలో మాకూ హెల్ప్ చేయండి.. అక్కడ వైఫై (WiFi), మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ ఉంటుందా?" అని ఆరా తీస్తున్నారు.

అయితే, ఈ ఖర్చుల లెక్కలపై కొందరు నెటిజన్లు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. "హిమాచల్‌లో రవాణా ఖర్చులు చాలా ఎక్కువ. నెలకు రూ. 500 బడ్జెట్ అనేది అసాధ్యం. ప్రభుత్వ బస్సుల్లో వెళ్తే ఓకే కానీ, క్యాబ్స్ వాడితే ఆ బడ్జెట్ అస్సలు సరిపోదు" అని ఒకరు కౌంటర్ ఇచ్చారు.

ఏదేమైనా.. "నాకు కూడా ఓ రిమోట్ జాబ్ దొరికితే ఎంత బాగుండు.. నా జీవితాంతం పర్వతాల్లోనే గడిపేస్తా" అని చాలామంది తమ డ్రీమ్ లైఫ్‌ను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement