త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Arjun | సద్గురు ‘ఇషా ఆశ్రమం’ నా సెకండ్ హోమ్.. అక్కడికే పరుగెత్తుకుంటూ వెళ్తా: నటి సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

రణ్‌వీర్ సింగ్ సరసన 'ధురంధర్' సినిమాలో మెప్పించిన నటి సారా అర్జున్ తాజాగా సద్గురు ఇషా ఫౌండేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సక్సెస్ సీక్రెట్ అదేనంటోంది.

J

Entertainment | Published On Jun 18, 2026, 11.00 pm IST

Sara Arjun | సద్గురు ‘ఇషా ఆశ్రమం’ నా సెకండ్ హోమ్.. అక్కడికే పరుగెత్తుకుంటూ వెళ్తా: నటి సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
  • జూన్ 18న తన 21వ పుట్టినరోజు జరుపుకున్న 'ధురంధర్' నటి సారా అర్జున్
  • కోయంబత్తూరులోని సద్గురు 'ఇషా హోమ్ స్కూల్'లో తన విద్యాభ్యాసం సాగిందని వెల్లడి
  • ఇషా ఆశ్రమం తనకు 'సెకండ్ హోమ్' లాంటిదని, అవకాశం దొరికినప్పుడల్లా పరుగెత్తుకుంటూ వెళ్తానని కామెంట్స్
  • ఇటీవల జరిగిన ఇషా మహా శివరాత్రి వేడుకల్లో తమన్నా, మౌనీ రాయ్ తదితరులతో కలిసి సారా చేసిన డ్యాన్స్ వైరల్

Sara Arjun | త్రినేత్ర.న్యూస్ : రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కు జోడీగా 'ధురంధర్', 'ధురంధర్ 2' (Dhurandhar) సినిమాల్లో నటించి మెప్పించిన యంగ్ హీరోయిన్ సారా అర్జున్ (Sara Arjun) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జూన్ 18న ఆమె తన 21వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా కోయంబత్తూరులోని సద్గురు 'ఇషా యోగా సెంటర్‌' (Isha Yoga Centre) తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. ఇషా స్కూల్ తనకు 'సెకండ్ హోమ్' లాంటిదని తన మనసులోని మాటను బయటపెట్టింది.

అవకాశం దొరికితే అక్కడికే

ఇటీవల మహా శివరాత్రి (Maha Shivratri) వేడుకల సందర్భంగా సారా అర్జున్ ఇషా ఫౌండేషన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. "నేను ఇషా హోమ్ స్కూల్ పూర్వ విద్యార్థిని (Alumna). ఆ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టం. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు వరుసగా అక్కడే శివరాత్రి జరుపుకునేదాన్ని. మళ్లీ ఇప్పుడు అవకాశం దొరకగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను. తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.

నా సక్సెస్‌కు కారణం అదే!

తన భవిష్యత్ ప్రణాళికల (Future plans) గురించి వివరిస్తూ.. తాను దేనినీ ముందుగా ప్లాన్ చేసుకోనని, ఏది జరగాలో అది జరుగుతుందని సారా బదులిచ్చింది. తన జర్నీ పట్ల చాలా సంతోషంగా, బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నానని తెలిపింది. తన జీవితంలో చాలా గొప్ప పాఠాలు, మంచి లక్షణాలు అలవడటానికి ఇషా ఫౌండేషనే కారణమని సారా పేర్కొంది. అక్కడ గడిపిన సమయం వల్లే ప్రతి విషయాన్ని తాను గౌరవించడం నేర్చుకున్నానని, లైఫ్ పట్ల తన పర్స్పెక్టివ్ (Perspective) మారిపోయిందని తెలిపింది. ఇషా తనకు సెకండ్ హోమ్ (Second home) అని స్పష్టం చేసింది.

డ్యాన్స్ వీడియోలు వైరల్

కాగా, ఇషాలో జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో సారా అర్జున్‌తో పాటు స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, మౌనీ రాయ్ కూడా పాల్గొన్నారు. వీరంతా కలిసి వేడుకల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇషాలో అద్భుతమైన ప్రదర్శనలు చూసి తాను ఎంతో ఆనందించానని సారా అర్జున్ పేర్కొంది.

From Isha Home School to the sets of 'Dhurandhar': Actress Sara Arjun returns for Mahashivaratri 2026
by
u/karthiksynerg in
Sadhguru

 

View this post on Instagram

 

A post shared by Isha Foundation (@isha.foundation)

Advertisement
Advertisement