Viral Video | రెస్టారెంట్లలో ఫుడ్ తినాలంటేనే జనాలు ఎందుకు భయపడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. వంటలు ఎలా వండుతారో తెలియదు. కనీసం సర్వ్ చేసేటప్పుడు అయినా ఫుడ్ హైజీన్‌గా ఉండాలి కదా. కొన్ని రెస్టారెంట్లలో అయితే చేతులతోనే ఫుడ్‌ని తాకుతూ సర్వ్ చేస్తుంటారు. కస్టమర్లు కొందరు అవేవీ పట్టించుకోరు. కొందరు మాత్రం అలా సర్వ్ చేస్తే తినరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్లో సర్వర్ రాగి సంగటిని సర్వ్ చేస్తున్నాడు. చాలామంది కస్టమర్లు ఉండటంతో అప్పుడే వండిన రాగి సంగటి పెద్ద ముద్దను ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని దాన్ని చిన్న ముద్దలుగా చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న కస్టమర్లు కూడా ఏం మాట్లాడుకుండా రాగి సంగటిని లాగించేశారు. కానీ.. అలా సర్వ్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక అంతే.. చూసుకోండి. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దానిపై నెటిజన్లు పెద్ద చర్చే పెట్టారు. చేతికి గ్లోవ్స్ పెట్టుకోవాలని కూడా తెలియదా? ఆ వీడియోపై స్పందించిన నెటిజన్లు అంతా బాగానే ఉంది కానీ.. చేతికి గ్లోవ్స్ ఎందుకు పెట్టుకోలేదు. ఆ చేతులు ఎలా ఉన్నాయో తెలియదు. ఆ చేతులతో రాగి ముద్దను అటూ ఇటూ రుద్దుతూ దాన్ని ముద్దలుగా చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. దాన్ని అలా ఎలా తింటున్నారు అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అంత కష్టపడటం ఎందుకు? స్పూన్ తీసుకొని దాన్ని ముద్దలుగా చేయొచ్చుగా. ఆ చేతిని రాగి ముద్దుకు అంతలా రుద్దాలా? బాబోయ్.. అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. Somebody saw a ragi ball being served in a way they are not exposed to, and casually called it unhygienic. Five seconds of video shouldn't turn one into self-appointed experts This is a food that has nourished generations, built strong bodies, powered farmers, and working… pic.twitter.com/CXJAqYYKeD — Karthik Reddy (@bykarthikreddy) December 15, 2025