Pune Walk-in Interview | 8 నెలలు ఫ్రీగా పనిచేయాలి.. జీతం తర్వాత ఆలోచిస్తాం! ఇంటర్వ్యూలో హెచ్‌ఆర్ కండిషన్ విని యువకుడికి ఫ్యూజులవుట్
పుణెలో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఓ యువకుడికి హెచ్‌ఆర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. జీతం లేకుండా 8 నెలలు పనిచేయాలన్న కండిషన్ విని అతడు షాకయ్యాడు.
Viral news | Published On Jun 20, 2026, 10.00 pm IST
సంక్షిప్త సారాంశం
పుణెకు చెందిన ప్రణవ్ అనే యువకుడు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లగా, 6-8 నెలలు జీతం లేకుండా పనిచేయాలని హెచ్‌ఆర్ (HR) అడగడంతో అవాక్కయ్యాడు. ఇంటర్వ్యూలో ఎలాంటి టెక్నికల్ రౌండ్ లేకుండానే నేరుగా ఉచితంగా పనిచేయాలనే కండిషన్ పెట్టారు. భారీ స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన ఆ సంస్థలో కేవలం సీఈవో, హెచ్‌ఆర్ మాత్రమే ఉండటం గమనార్హం. ఎక్స్ (X) వేదికగా ప్రణవ్ తన అనుభవాన్ని పంచుకోగా, నిరుద్యోగుల సమయాన్ని వృథా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Pune Walk-in Interview | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుత కష్టకాలంలో జాబ్ (Job) సంపాదించడం ఒక ఎత్తైతే.. ఇంటర్వ్యూలలో హెచ్‌ఆర్‌లు (HR) అడిగే వింత ప్రశ్నలను తట్టుకోవడం మరో ఎత్తుగా మారింది. తాజాగా పుణెకు (Pune) చెందిన ప్రణవ్ అనే యువకుడు ఓ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి (Walk-in interview) వెళ్లగా.. అతడికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు జీతం లేకుండా పనిచేయాలని, ఆ తర్వాత అంతా బాగుంటే శాలరీ గురించి ఆలోచిస్తామని హెచ్‌ఆర్ అనడంతో అతడు కంగుతిన్నాడు.
టెక్నికల్ స్కిల్స్‌తో పనేలేదు..
తన అనుభవాన్ని వివరిస్తూ ప్రణవ్ ఎక్స్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో మొదటి రౌండ్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌తో జరిగింది. అందులో తన టెక్నికల్ స్కిల్స్ (Technical skills), ప్రాజెక్ట్స్ లేదా గత అనుభవం గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నేరుగా '8 నెలలు ఫ్రీగా పనిచేస్తావా? లేదా?' అని అడిగారు. మొదట అదొక జోక్ (Joke) అని ప్రణవ్ అనుకున్నాడు. కానీ అది నిజమేనని తెలిసి షాకయ్యాడు.
"ఏళ్ల తరబడి చదువుకుని, కొత్త టెక్నాలజీలు నేర్చుకుని, ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే.. ఇలా ఫుల్-టైమ్ (Full-time) జాబ్‌ను జీతం లేకుండా చేయమనడం ఏమాత్రం కరెక్ట్ కాదు" అని ప్రణవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం స్టైపెండ్‌తో (Stipend) కూడిన ఇంటర్న్‌షిప్ లాగా కాకుండా, మొత్తం రిస్క్ కాండిడేట్ మీద వేసి.. కంపెనీ సేఫ్‌గా ఉండాలని చూడటం దారుణమన్నాడు.
కంపెనీలో ఉన్నది ఇద్దరే..
భారీ స్థాయిలో వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించిన ఆ కంపెనీలో కేవలం ఇద్దరు వ్యక్తులు (సీఈవో, హెచ్‌ఆర్) మాత్రమే ఉండటం అతడిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్టప్స్ (Startups) మొదట్లో చిన్నగానే ఉంటాయని తనకు తెలుసునని, కానీ వందలాది మందిని పిలిచి నెలల తరబడి ఫ్రీగా పనిచేయమనడం జాబ్ సీకర్స్ (Job seekers) కష్టాన్ని అవమానించడమేనని మండిపడ్డాడు. కష్టకాలంలో ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురుచూసే నిరుద్యోగుల నిస్సహాయతను ఇలా క్యాష్ చేసుకోవడం మానుకోవాలని సూచించాడు. జాబ్ రాలేదన్న బాధలో ఉన్న అభ్యర్థులను కంపెనీలు ఫెయిర్‌గా ట్రీట్ చేయాలన్నాడు.

కార్పొరేట్ కల్చర్‌పై నెటిజన్ల ఫైర్
ప్రణవ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. నేటి కార్పొరేట్ కల్చర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనవసరమైన ఇంటర్వ్యూ రౌండ్స్, వాక్-ఇన్ డ్రైవ్స్, గోస్టింగ్ (Ghosting) పేరుతో కంపెనీలు నిరుద్యోగుల సమయాన్ని వృథా చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని, అప్పుడు నేరుగా సీఈవోనే నిలదీయడంతో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ క్షమాపణలు చెప్పిందని మరో యూజర్ కామెంట్ చేశాడు. "అనుభవం వస్తుందనే సాకుతో.. జీతం లేని ఉద్యోగాలను (Unpaid jobs) ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు" అని నెటిజన్లు యువతకు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Delhi Baby Trafficking | ఢిల్లీలో 'బేబీ బజార్'.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్
- ●Layoff Stories | సంతోషంగా ఊరికి పయనమైన యువకుడు.. దారి మధ్యలో లేఆఫ్ మెయిల్.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టోరీ!
- ●Donald Trump Giorgia Meloni | ట్రంప్, మెలోని మధ్య ముదిరిన 'ఫోటో' వార్.. నా పాపులారిటీ గురించి నీకెందుకు అంటూ ఇటలీ పీఎం ఫైర్!
- ●OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
- ●Balan Review | బాలన్ రివ్యూ - మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Delhi Baby Trafficking | ఢిల్లీలో 'బేబీ బజార్'.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్

Layoff Stories | సంతోషంగా ఊరికి పయనమైన యువకుడు.. దారి మధ్యలో లేఆఫ్ మెయిల్.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టోరీ!

Donald Trump Giorgia Meloni | ట్రంప్, మెలోని మధ్య ముదిరిన 'ఫోటో' వార్.. నా పాపులారిటీ గురించి నీకెందుకు అంటూ ఇటలీ పీఎం ఫైర్!

OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ




