త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Most Searched Indian Personalities 2025 | ఈసారి ఎవ్వరూ ఊహించని వాళ్లను వెతికిన ఇండియన్స్

క్రికెటర్ల తర్వాత జనాలు ఎక్కువగా బాలీవుడ్ బిగ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, అలియా భట్, కృతి సనన్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లాంటి వాళ్లను వెతకగా, ఆ తర్వాత లిస్టులో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లిస్టులో ఉన్నారు.

J

Viral news | Published On Dec 12, 2025, 3.11 pm IST

Most Searched Indian Personalities 2025 | ఈసారి ఎవ్వరూ ఊహించని వాళ్లను వెతికిన ఇండియన్స్
Advertisement

Most Searched Indian Personalities 2025 | అయిపాయె. ఇంకో 18 రోజులు అయితే 2025 సంవత్సరం కూడా పోయి 2026 వస్తుంది. 2025 మనకు ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా 2025 కి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నం కాబోతోంది. ఈనేపథ్యంలో 2025 లో జనవరి నుంచి ఇప్పటి వరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఇండియన్స్ ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువగా సినిమా హీరోలు, హీరోయిన్లు, లేదంటే పొలిటికల్ లీడర్ల గురించి అనుకుంటారు కానీ.. ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా? క్రికెటర్స్‌ను. అవును.. టాప్‌లో ఉన్నవాళ్లంతా క్రికెట్ ప్లేయర్లే.

టాప్ 10 మొత్తం క్రికెటర్లే

టాప్ 10 లో ఉన్న ఫేమస్ పర్సనాలిటీలు అందరూ క్రికెటర్లే. అందులో మొదటి స్థానం సంపాదించుకున్నది ఎవరో కాదు.. 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ. అతడి గురించే జనాలు ఎక్కువగా ఈ సంవత్సరం సెర్చ్ చేశారు. ఐపీఎల్, అండర్ 19 టీమ్‌లో మనోడి ఆటను అందరూ చూశారు. అందుకే అసలు ఎవరు ఈ బుల్లి క్రికెటర్ అని ఎక్కువగా వెతికి ఉంటారు. ఆ తర్వాత లిస్టులో ప్రియాన్ష్ ఆర్యా, అభిషేక్ శర్మ, షేక్ రషీద్, జెమిమా రోడ్రిగ్యూస్, ఆయుష్, స్మృతి మందన్నా, కరూర్ నాయర్, ఉర్విల్ పటేల్, విగ్నేష్ పుతుర్ ఉన్నారు.

క్రికెటర్ల తర్వాతి స్థానం బాలీవుడ్ స్టార్స్‌కే