త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sicily Filming Locations | సిసిలీ ఐలాండ్: హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌కు ఫేవరెట్ అడ్డా! ఎందుకో తెలుసా?

కాక్‌టెయిల్ 2 నుంచి వైట్ లోటస్ వరకు... ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు సిసిలీ దీవుల్లోనే ఎందుకు షూటింగ్ జరుపుకుంటున్నాయో తెలుసుకుందాం రండి.

J

Tourism | Published On Jul 21, 2026, 11.00 pm IST

Sicily Filming Locations | సిసిలీ ఐలాండ్: హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌కు ఫేవరెట్ అడ్డా! ఎందుకో తెలుసా?
Advertisement
  • అందమైన బీచ్‌లు, చారిత్రక కట్టడాలతో 'సిసిలీ' ఐలాండ్ సినిమా షూటింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌
  • క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ', బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'కాక్‌టెయిల్ 2' షూటింగ్స్ ఇక్కడే
  • గ్లోబల్ పాపులర్ సిరీస్ 'ది వైట్ లోటస్' సీజన్ 2 కు కూడా ఈ ఇటాలియన్ దీవే వేదిక
  • అద్భుతమైన వాతావరణం, వైవిధ్యమైన లొకేషన్స్ ఈ దీవికి ప్రధాన బలం

Sicily Filming Locations | త్రినేత్ర.న్యూస్ : ఇటలీలోని అందమైన ప్రాంతం సిసిలీ (Sicily). గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఫిల్మ్ డెస్టినేషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. క్రిస్టల్-క్లియర్ బీచ్‌లు, పురాతన శిథిలాలు, అద్భుతమైన పర్వతాలతో ఈ ద్వీపం డైరెక్టర్లకు మొదటి చాయిస్‌గా మారింది. హాలీవుడ్ సెన్సేషన్ 'ది ఒడిస్సీ' (The Odyssey) తో పాటు రీసెంట్ బాలీవుడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేకర్స్ ఈ చిన్న దీవి వైపు ఎందుకు క్యూ కడుతున్నారు? ఇక్కడి లొకేషన్లలో ఉన్న మ్యాజిక్ ఏంటి?

'ది ఒడిస్సీ' కి చారిత్రక నేపథ్యం

క్రిస్టోఫర్ నోలన్ అద్భుత సృష్టి ది ఒడిస్సీ. హోమర్ పురాణ కాలాన్ని తెరపై ఆవిష్కరించేందుకు నోలన్ సిసిలీలోని చారిత్రక శిథిలాలను, అద్భుతమైన తీరప్రాంతాలను ఎంచుకున్నారు. వాయువ్య తీరంలో ఉన్న ఎగాడి ద్వీప సమూహంలోని అందమైన 'ఫవిగ్నానా' (Favignana) దీవిని ఈ సినిమాలో హీరో హోమ్‌టౌన్‌గా అద్భుతంగా చూపించారు.

15వ శతాబ్దానికి చెందిన 'కాస్టెల్లో డి శాంటా కాటెరినా'లో ఈ సినిమా కోసం భారీ షెడ్యూల్ చేశారు. రోజుకు 900 అడుగుల మేర కష్టతరమైన ట్రెక్కింగ్ చేసి, హెలికాప్టర్ల ద్వారా భారీ ఎక్విప్‌మెంట్‌ను అక్కడికి తరలించి మరీ షూటింగ్ చేయడం విశేషం.

'కాక్‌టెయిల్ 2' లో రొమాంటిక్ వైబ్స్

షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ హోమీ అడజానియా తెరకెక్కించిన చిత్రం కాక్‌టెయిల్ 2. అద్భుతమైన యూరోపియన్ బ్యాక్‌డ్రాప్‌ను క్రియేట్ చేయడానికి సిసిలీ అందాలను మేకర్స్ భలేగా వాడుకున్నారు.

టార్మినా (Taormina): లగ్జరీ స్పాట్‌గా పేరొందిన ఈ ప్రదేశంలో రొమాంటిక్, సన్‌సెట్ సన్నివేశాలను చిత్రీకరించారు.

సెఫాలు (Cefalù): అందమైన బీచ్, సీ ఫుడ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ టౌన్ సినిమాలో ఎన్నో సీన్లలో కనిపిస్తుంది.

వీటితో పాటు పలెర్మో, శాన్ విటో లో కాపో ప్రాంతాల్లో కొన్ని సీన్స్ తీశారు. పాపులర్ డ్యాన్స్ ట్రాక్ 'జబ్ తలక్' (Jab Talak), అలాగే 'మాషూఖా' (Mashooqa) పాటలను సిసిలీలోని లగ్జరీ బోట్స్, మధ్యధరా సముద్ర తీరాల్లోనే షూట్ చేశారు.

'ది వైట్ లోటస్ (సీజన్ 2)' అడ్డా

గ్లోబల్ హిట్ సిరీస్ ది వైట్ లోటస్ సీజన్ 2 పూర్తిగా సిసిలీ దీవుల్లోనే సాగుతుంది. ఈ షోలో చారిత్రక భవనాలను లగ్జరీ రిసార్ట్‌లుగా చూపించారు. టార్మినాలోని ప్రసిద్ధ ఫోర్ సీజన్స్ హోటల్ 'శాన్ డొమెనికో ప్యాలెస్'ను ఈ సిరీస్‌లో వైట్ లోటస్ రిసార్ట్‌గా చూపించారు.

అలాగే సెఫాలు తీరంలో మొదటి ఎపిసోడ్ ప్రారంభ సన్నివేశాలు షూట్ చేశారు. నటీమణులు హార్పర్, డాఫ్నే కలిసి వెళ్లే ట్రిప్ కోసం 'నోటో' నగర వీధులను వాడుకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన 'కాస్టెల్లో డెగ్లీ షియావి' ఎస్టేట్‌ను ఓ గ్లామరస్ విల్లాగా అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు.

ఫిల్మ్‌మేకర్స్‌ను సిసిలీ ఎందుకు అంతగా ఆకర్షిస్తోంది?

సిసిలీ కేవలం ఒక అందమైన లొకేషన్ మాత్రమే కాదు, అందులో వేల ఏళ్ల చరిత్ర దాగుంది. ఇతర లగ్జరీ టూరిస్ట్ స్పాట్స్‌తో పోలిస్తే.. ఇక్కడ పాతకాలపు పురాతన కట్టడాలు, మోడరన్ లవ్ స్టోరీలకు సరిపోయే అందమైన బీచ్‌లు అన్నీ పక్కపక్కనే ఉంటాయి.

ఒకే ప్రాంతంలో అగ్నిపర్వతాలు, పచ్చని ప్రకృతి, అందమైన బీచ్‌లు ఉండటంతో ఒకే దీవిలో పలు రకాల జానర్లకు (Genres) సంబంధించిన సినిమాలను షూట్ చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. చారిత్రక కథలకు (ది ఒడిస్సీ), మోడరన్ కథలకు (కాక్‌టెయిల్ 2) సరిపోయే లొకేషన్స్ అన్నీ ఒకే చోట దొరుకుతుండటంతో డైరెక్టర్లు సిసిలీని తమ లక్కీ స్పాట్‌గా భావిస్తున్నారు.

Advertisement
Advertisement