Hidden Gems Of India | సీక్రెట్ బీచ్ నుంచి మూన్‌ల్యాండ్ వరకు.. భారత్‌లో అద్భుతమైన ఐదు పర్యాటక ప్రాంతాలివే..! ఒక్కసారైనా వీటిని చూడాల్సిందే..!
Hidden Gems Of India | ప్రయాణం అనేది అద్భుతమైంది. చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొత్త అనుభూతి పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడికి దూరంగా, ప్రకృతి ఒడిలో కాసేపు గడపాలనే కోరిక ఉంటుంది. దేశంలో ఎన్నో ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కానీ, ఎక్కువగా ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాలు సైతం ఉన్నాయి. కొండల మధ్య ఉన్న చిన్న గ్రామాలు, అడవుల నడుమ ప్రవహించే జలపాతాలు, కాలం నెమ్మదిగా నడిచేలా అనిపించే ప్రశాంతమైన లోయలు ఇవన్నీ కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి. దేశంలోని ఐదు అత్యంత రహస్యమైన ప్రాంతాల గురించి ఓసారి తెలుసుకుందాం..!
Hidden Gems Of India | ప్రయాణం అనేది అద్భుతమైంది. చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొత్త అనుభూతి పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడికి దూరంగా, ప్రకృతి ఒడిలో కాసేపు గడపాలనే కోరిక ఉంటుంది. దేశంలో ఎన్నో ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కానీ, ఎక్కువగా ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాలు సైతం ఉన్నాయి. కొండల మధ్య ఉన్న చిన్న గ్రామాలు, అడవుల నడుమ ప్రవహించే జలపాతాలు, కాలం నెమ్మదిగా నడిచేలా అనిపించే ప్రశాంతమైన లోయలు ఇవన్నీ కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయి. దేశంలోని ఐదు అత్యంత రహస్యమైన ప్రాంతాల గురించి ఓసారి తెలుసుకుందాం..!
కశ్మీర్‌లోని అగ్రంగ్ కేల్

కశ్మీర్‌లోని అగ్రంగ్ కేల్ అనే చిన్న గ్రామం ఓ కళాకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా కనిపిస్తుంది. స్పష్టమైన నీలి జలాలు, చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం.. మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ ప్రదేశాకి మరింత వన్నెను తెస్తాయి. కశ్మీర్‌లోని అగ్రంగ్ కేల్‌ను భారత బ్లూ లగూన్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతకాలం వాస్తవ ప్రపంచంతో అదృశ్యమవుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు సైన్యం సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోలింగ్ చేసే కేబుల్ కారును ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మూడు నుంచి నాలుగు గంటల పాటు ట్రెక్కింగ్ చేయొచ్చు.
ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జియార్‌ను మినీ స్విట్జర్లాండ్‌గా పిలుస్తారు. పచ్చని పచ్చికభూములు, పైన్ అడవులు, సుదూర మంచుతో కప్పబడిన శిఖరాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. నాగ దేవుడైన ఖజ్జీ నాగ ఆలయం సైతం ఇక్కడే ఉన్నది. కలతోప్ ఖజ్జియార్ అభయారణ్యం అనేక రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉన్నది. ఇక్కడ నాగదేవతా విగ్రహాలతో పాటు శివుడు, హడింబా విగ్రహాలున్నాయి. ఖజ్జీ పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కాంగ్రాలోని గగ్గల్ విమానాశ్రయం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
జైసల్మేర్ ఇసుక తిన్నెలు..

జైసల్మేర్ ఇసుక దిబ్బలను గోల్డెన్ డెసర్ట్‌గా పిలుస్తుంటారు. జైసల్మేర్ ఇసుక తిన్నెలు చూపరులను కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లో ఎక్కువగా ఇసుక ప్రాంతం ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్య అస్తమయం సమయంలో ఇసుక బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈ సమయంలో ఇసుక తిన్నెలను చూస్తే మరొక ప్రపంచంలోకి వెళ్లినట్లు అనుభూతి కలుగుతుంది. జైసల్మేర్ నుంచి సామ్ సాండ్ డ్యూన్స్ వరకు దూరం 45 కిలోమీటర్లు ఉంటుంది. జైసల్మేర్ నుంచి సామ్ డ్యూన్స్ వరకు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒంటె సవారీలు, జీప్ సఫారీలు, క్యాంపింగ్, రాత్రిపూట నక్షత్రాలను చూడడం, సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో కూడిన అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.
సెయింట్ మేరీస్ ఐలాండ్, కర్నాటక

కర్నాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్‌ను సీక్రెట్ బీచ్‌గా పిలుస్తుంటారు. దీనికి కారణం ఇక్కడి అగ్నిపర్వత శిలా రూపాలు భూమిపై చాలా అరుదుగా ఉంటాయి. నీలి సముద్రం, సహజ సిద్ధమైన రాళ్లు ఈ ప్రదేశాన్ని కట్టిపడేస్తాయి. తీరప్రాంత పర్యాటకులకు ఇది స్వర్గధామం నిలుస్తుంది. అందమైన బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. సెయింట్ మేరీస్ ద్వీపానికి పండుగ, సెలవుల సీజన్‌లో భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. సముద్రం మధ్యలో నిలబడి ప్రకృతి ఆస్వాదిస్తారు. సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేది ఉడిపి తీరానికి దూరంగా ఉన్న నాలుగు చిన్న ద్వీపాల సమూహం. ఈ ప్రదేశం దాని తెల్లటి ఇసుక, స్వచ్ఛమైన నీలి నీటికి ప్రసిద్ధి చెందింది. మాల్పే బీచ్ నుంచి సుమారు 30 నిమిషాల పడవలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
లమయూరు, లడఖ్

లడఖ్‌లోని ఈ ప్రాంతం చంద్రుడి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అందుకే లమయూరుకు మూన్‌ల్యాండ్, చంద్రలోక్ అనే పేరు వచ్చింది. ఇక్కడి పొడి కొండలు, వింత ఆకారాలు, నిశ్శబ్దం ఈ ప్రదేశాన్ని భూమి కంటే వేరే గ్రహంలా తలపిస్తాయి. గాలి, నీటితో ఏర్పడిన వింతైన రాతి నిర్మాణాలు, చంద్రునిపై ఉన్నట్లుగా అనిపించడం కారణంగా మూన్‌ల్యాండ్‌గా పిలుస్తారు. 11వ శతాబ్దానికి చెందిన పురాతన బౌద్ధ మొనాస్టరీ (ఆశ్రమం)కి ప్రసిద్ధి చెందింది. లేహ్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న లమయూరుకు సమీప విమానాశ్రయం లేహ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి టాక్సీ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






