Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోవర్ యాత్ర ఫీజు పెరిగింది..! ఒక్కొక్కరికి ఎంత ఖర్చో తెలుసా..?
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోవర్ యాత్ర పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏటా యాత్రలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సారి యాత్ర ఫీజును రూ.35వేల వరకు పెరిగింది. డాలర్ విలువ పెరుగడమే ఇందుకు కారణమని ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోవర్ యాత్ర పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏటా యాత్రలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సారి యాత్ర ఫీజును రూ.35వేల వరకు పెరిగింది. డాలర్ విలువ పెరుగడమే ఇందుకు కారణమని ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది మొత్తం యాత్ర ఖర్చు సుమారు రూ.1.74 లక్షలు ఉండగా.. ఈసారి అది రూ.2.09 లక్షలకు చేరుకుంది. ఇందులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ (కేఎంవీఎన్)కు చెల్లించాల్సిన మొత్తం రూ.65వేలుగా నిర్ణయించారు. భారత భూభాగంలో ప్రయాణం, వసతి, భోజనం, గైడ్‌ల ఏర్పాట్లను కేఎంవీఎన్ సంస్థ చూసుకుంటుంది. గత ఏడాది ఒక్కో యాత్రికుడికి కేఎంవీఎన్ ఫీజు రూ.57 వేలు వసూలు చేసింది.
ఇక టిబెట్‌కు సంబంధించిన వీసా సహా ఇతర ఖర్చులను విదేశాంగ మంత్రిత్వ శాఖకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం సుమారు 1400 డాలర్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కేఎంవీఎన్ జనరల్ మేనేజర్ విజయ్ నాథ్ శుక్లా మాట్లాడుతూ.. కైలాస్ మానసరోవర్ యాత్ర ఫీజులను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు. గత ఏడాది 10 బృందాలుగా మొత్తం 250 మంది యాత్రికులు పాల్గొన్నారని.. ఈసారి 10 బృందాల్లో ప్రతి బృందంలో 50 మందితో యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కుమావోన్ ప్రాంతంలోని లిపులేఖ్ మార్గం ద్వారా యాత్రికుడికి మొత్తం ఖర్చు రూ.2.09 లక్షలు అవుతుందని, ఇందులో కేఎంవీఎన్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.65 వేలుగా ఉంటుందని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా.. 1947లో భారత స్వాతంత్య్రం తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర ప్రారంభమైంది. 1962లో భారత్-చైనా యుద్ధం సమయంలో యాత్ర నిలిచిపోయింది. తిరిగి 1981లో తిరిగి ప్రారంభమై 2019 వరకు కొనసాగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాంతో 2025 వరకు యాత్ర మళ్లీ ప్రారంభం కాలేదు. గతేడాది యాత్ర మొదలైంది. పాత రూట్‌లో మార్పులు చేసి చంపావత్, టనక్‌పూర్ మార్గాల ద్వారా యాత్ర నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే మార్గంలో యాత్ర కొనసాగనుంది. జాగేశ్వర్, చితై వంటి పుణ్యక్షేత్రాలను యాత్రలో భాగంగా దర్శించుకోవచ్చు. కేఎంవీఎన్ వసూలు చేసే మొత్తం భారత భూభాగంలో చేసే ఏర్పాట్లకే పరిమితమని, టిబెట్ ప్రాంతంలో అయ్యే ఖర్చులకు డాలర్లలో వేరుగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం యాత్ర ఫీజులోనే ప్రయాణం, వీసా, టిబెట్‌లో ఖర్చులు, గైడ్స్, మెడికల్ ఖర్చులు కవర్ అవుతాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Road Accident | చిట్యాల సమీపంలో కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు.. బాలుడు సహా నలుగురు దుర్మరణం
- ●Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది!
- ●Horoscope | జూలై 5 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!
- ●F1 Visa Rejection | అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా US F-1 వీసా రిజెక్ట్.. ఆ ఒక్క 'తప్పు' వల్లే అని తెలిసి కంగుతిన్న భారతీయ విద్యార్థి!
- ●Hyatt hotel Raipur scam | 36 ఏళ్లలో 300 లగ్జరీ హోటళ్లకు టోకరా.. 'చార్లెస్ శోభరాజ్' స్టైల్లో చీటింగ్, చివరకు ఇలా దొరికిపోయాడు
- ●Why Dogs Chase Cars | రోడ్డుపై బైక్ లేదా కారు వెనక కుక్కలు ఎందుకు పరుగెడతాయి? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

Road Accident | చిట్యాల సమీపంలో కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు.. బాలుడు సహా నలుగురు దుర్మరణం

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది!

Horoscope | జూలై 5 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!

F1 Visa Rejection | అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా US F-1 వీసా రిజెక్ట్.. ఆ ఒక్క 'తప్పు' వల్లే అని తెలిసి కంగుతిన్న భారతీయ విద్యార్థి!



