త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

G

Horoscope | Published On Jul 5, 2026, 7.13 am IST

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది!
Advertisement

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ‌కాలం కొన‌సాగుతున్న‌ది. ఆర్థికంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో విజ‌యావ‌కాశాలు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు లభించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి.

వృషభం (Taurus)

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సమస్యలు తగ్గినప్పటికీ మెరుగైన లాభాల కోసం మరికొంత కాలం వేచి చూడాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. భాగస్వాముల సహకారం ఉంటుంది. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. సమాజంలో మీ పరపతి, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో సామరస్యంతో వ్యవహరించడం వల్ల సమస్యలు తొలగుతాయి. పని ప్రదేశంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కోసం అదనపు కృషి చేయాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.

మిథునం (Gemini)

అన్ని రంగాల వారు ఈ వారం శుభ ఫలితాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మీ శ్ర‌మ‌కు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. ఆస్థి, ధనవృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మీ పరపతి, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి అద్భుతమైన పురోగతి, విజయం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. వ్యాపారులు కొంత అప్రమత్తగా ఉండాలి. భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు నిధుల కొరత ఉండదు. ఖర్చులు కూడా నియంత్రణలోనే ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించే ఘటనలకు దూరంగా ఉండండి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు, ఆశించిన లాభాలు పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఒక సమస్య పరిష్కరిస్తారు.

కన్య (Virgo)

ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు కోసం శ్రమించక తప్పదు. ఉద్యోగ బాధ్యతలు పెరగడంతో శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో వ్యాపారులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు రాకుండా వ్యవహరించాలి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉన్నప్పటికీ క్ర‌మంగా అన్నీ సర్దుకుంటాయి. అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి.

తుల (Libra)

తుల రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. ఆర్థికంగా అత్యంత అనుకూలం, అయితే ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది. విదేశీ వ్యాపారాలకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఆహ్లాదంగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచన ఉంది. జీవిత భాగ‌స్వామితో స‌మ‌యం గ‌డుపుతారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి పదోన్నతులతో ప్రోత్సహిస్తారు. వ్యాపారంలో ధనయోగం బలంగా ఉంది. దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రాజెక్టులు పూర్తి కావడంతో లాభాలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారులు వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఆర్ధికంగా కొంత కష్టకాలం. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు పెర‌గ‌డంతో సమస్యలు త‌ప్ప‌వు. బయటి వ్యక్తుల జోక్యంతో కుటుంబంలో విభేదాలు పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు, సవాళ్లు ఉండవచ్చు. అప్రమత్తంగా వ్యవహరించడంతో సత్ఫలితాలు పొంద‌వ‌చ్చు. ఉద్యోగులు తమ కెరీర్​లో వేగవంతమైన అవకాశాలు పొందుతారు. గ‌ట్టిగా ప్రయత్నిస్తే సవాళ్లను అధిగమించవచ్చు. ఖ‌ర్చులు పెరుగడం వ‌ల్ల ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ స‌మ‌స్య‌లు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందడంతో సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందువ‌ల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కుంభం (Aquarius)

ఈ రాశి వారికి సంతోషదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆశించిన ఫ‌లితాలు పొందుతారు. తెలివిగా వ్య‌వ‌హ‌రించి ఉద్యోగంలో మంచి ఫలితాలు రాబడుతారు. పదోన్నతి పొందే అవ‌కాశం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయావకాశాలు పెరుగుతాయి. తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు అనువైన సమయం. లాభాలు పెరుగుతాయి. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు త‌ప్ప‌నిస‌రి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగాలంటే అవగాహన ముఖ్యం.

Advertisement

తాజావార్తలు

Advertisement