త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tahsildar Suspended | రైతుపై అనుచిత వ్యాఖ్య‌లు.. గ‌జ్వేల్ త‌హ‌శీల్దార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు

Tahsildar Suspended | సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ చిట్టంప‌ల్లి స్వామిపై (Swamy) సస్పెన్షన్ (Tahsildar Suspended) వేటుప‌డింది. ఇటీవ‌ల భూస‌మ‌స్య ప‌రిష్కారం కోసం వెళ్లిన‌ ఓ రైతును ఉద్దేశించి తహశీల్దార్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

G

Telangana | Published On Oct 11, 2026, 12.32 pm IST

Tahsildar Suspended | రైతుపై అనుచిత వ్యాఖ్య‌లు.. గ‌జ్వేల్ త‌హ‌శీల్దార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు
Advertisement

Tahsildar Suspended | త్రినేత్ర న్యూస్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ చిట్టంప‌ల్లి స్వామిపై (Swamy) సస్పెన్షన్ (Tahsildar Suspended) వేటుప‌డింది. ఇటీవ‌ల భూస‌మ‌స్య ప‌రిష్కారం కోసం వెళ్లిన‌ ఓ రైతును ఉద్దేశించి తహశీల్దార్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. `నువ్వింకా బ‌తికే ఉన్నావా? పురుగుల మందు తాగ‌లేదా?` అంటూ అవ‌మానించేలా మాట్లాడిన‌ట్లుగా ఉన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో త‌హ‌శీల్దార్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆర్డీవో (RDO) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జిల్లా క‌లెక్ట‌ర్ కే. హైమావతి.. త‌హ‌శీల్దార్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీచేశారు. అనుమ‌తి లేకుండా హెడ్‌క్వార్ట‌ర్స్ విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశించారు.

అస‌లేం జ‌రిగిందంటే..

వ్య‌వ‌సాయ భూమికి సంబంధించిన స‌మ‌స్య‌తో ఓ రైతు గ‌త కొంత‌కాలం నుంచి గ‌జ్వేల్ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఎమ్మార్వో కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌ళ్లీ ఇటీవ‌ల బాధిత రైతు ఎమ్మార్వో ఆఫీసు మెట్లెక్కాడు. ఇక ఎమ్మార్వో స్వామి త‌న కార్యాల‌యంలో ప‌లువురు కూర్చుని మాట్లాడుతుండ‌గా.. స‌ద‌రు రైతు నిల‌బ‌డి త‌మ సమ‌స్య‌ను ఎమ్మార్వోకు విన్న‌వించ‌బోయాడు.

ఎమ్మార్వో వెంట‌నే స్పందిస్తూ.. నువ్వు ఇంకా బ‌తికే ఉన్నావా.. పురుగుల మందు తాగ‌లేదా..? అని అవ‌హేళ‌న చేశారు. అంతేకాదు వెకిలిగా న‌వ్వారు. నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే.. అహంకారంగా అవును.. వస్తది బరాబర్ వస్తది.. అని ఎమ్మార్వో స‌మాధానం చెబుతూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అయింది.

 

Advertisement
Advertisement