Digitel Service | డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ చర్చ
Digitel Service | రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్ఠం చేసి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Digitel Service | రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్ఠం చేసి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సీఎస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. డిజిటల్ ఇండియా–వికసిత్ భారత్-2047 లక్ష్యాల్లో భాగంగా మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ అంశాలపై చర్చ జరిగింది.
డిజిటల్ సంస్కరణలకు ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. ప్రజా సేవల నాణ్యత పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డేటా గవర్నెన్స్ వంటి అంశాల్లో సాంకేతిక సహకారం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ, హరియాణా రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌లు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అనంతరం టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ-ఫైబర్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను వివిధ శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేశ్ ఉత్తమ్‌చందానీ, టి-ఫైబర్ ఎండీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
ఆగస్టు 12, 2026

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Dasoju Sravan | రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీ : ఎమ్మెల్సీ దాసోజు
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు



