Nagarkurnool | ఇల్లరికం అల్లుడు.. అర్ధరాత్రి అత్తపై హత్యాచారం
Nagarkurnool | బిడ్డ క్షేమం కోరి తాగుడుకు బానిసగా మారిన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. అయినా కూడా అల్లుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు ఇల్లరికం తెచ్చుకున్న అత్తపైనే అర్థరాత్రి వేళ అత్యాచారం చేసి కొట్టి చంపాడు.
Nagarkurnool | త్రినేత్ర.న్యూస్ : బిడ్డ క్షేమం కోరి తాగుడుకు బానిసగా మారిన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. అయినా కూడా అల్లుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు ఇల్లరికం తెచ్చుకున్న అత్తపైనే అర్థరాత్రి వేళ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో చోటు చేసుకుంది.
కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నాళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేసింది. కొన్నాళ్లు భార్యాభర్తల సంసార జీవితం సాఫీగానే సాగింది. గత కొద్ది నెలల నుంచి అల్లుడు తాగుడుకు బానిసగా మారాడు. కుమార్తెను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఇల్లరికం తెచ్చుకుంటే అల్లుడు బాగుపడుతాడేమోనని అత్త భావించింది. మొత్తానికి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది.
మొదటికే మోసం తెచ్చిన ఇల్లరికం
ఇక అత్తారింటికి వచ్చిన అల్లుడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. భార్యను వేధింపులకు గురి చేయడమే కాదు.. అత్తపై కామంతో కన్నేశాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు.. ఆపై కొట్టి చంపాడు. సోమవారం ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



