Divine Waste Collection Drive | దేవుళ్ల పాత ఫొటోలు ఉన్నాయా..? మాకు ఇచ్చేయండి..!
Divine Waste Collection Drive | మీ ఇంట్లో దేవుళ్ల పాత ఫొటోలు( God Photos ) ఉన్నాయా..? విరిగిన విగ్రహాలు ఉన్నాయా..? దేవతామూర్తులతో కూడిన పాత క్యాలెండర్లు( God Calendars ) ఉన్నాయా..? అయితే వీటిని ఎక్కడ పడేయాలా..? అనే ఆలోచన మీలో ఉండి ఉంటది. ఇప్పుడు ఆ ఆలోచన అక్కర్లేదు. వీటి సేకరణ విషయంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( Cyberabad Municipal Corporation ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక వ్యర్థాల సేకరణ కార్యక్రమం( Divine Waste Collection Drive ) పేరిట కొత్త కార్యక్రమానికి సీఎంసీ( CMC ) శ్రీకారం చుట్టింది. వివరాలివే..
Divine Waste Collection Drive | త్రినేత్ర.న్యూస్ : నిత్యం పూజలందుకునే దేవతామూర్తుల పాత ఫొటోలు( God Photos ), విగ్రహాలు, దేవుడి ఫొటోలతో కూడిన క్యాలెండర్లు( God Calendars ), ఇతరత్రా ఆధ్యాత్మిక వస్తువులను ( Spiritual Items ) నగర ప్రజలు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. మరి ముఖ్యంగా మిగతా వ్యర్థాలతో పాటు వాటిని కూడా కలిపిసే చెత్తకుప్పల్లో వేస్తుంటారు. కొందరైతే చెరువులతో పాటు నీరు ప్రవహించే ప్రాంతాల్లో విసిరేస్తుంటారు. చివరకు ఇవన్నీ డంపింగ్ యార్డుకు చేరుకుంటాయి. పాత దేవుడి పటాలు, విరిగిన విగ్రహాలతో పాటు దేవతామూర్తులతో కూడిన క్యాలెండర్లను పడేసే విషయంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) సరికొత్త నిర్ణయం తీసుకుంది.
జులై 18న శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు
భక్తులు తమ పాత దేవుడి ఫొటోలను, విరిగిన విగ్రహాలను, క్యాలెండర్లను చెత్తకుప్పలు, చెరువుల్లో పడేయకుండా.. వాటి సేకరణకు సీఎంసీ శ్రీకారం చుట్టింది. జులై 18న శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు ఆధ్యాత్మిక వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని సీఎంసీ నిర్ణయించింది. ఈ వ్యర్థాల సేకరణను మేడ్చల్, మదాపూర్, అల్విన్ కాలనీ, కొంపల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో సేకరించనున్నారు. ఇందుకోసం సర్కిల్ కోఆర్డినేటర్లను నియమించారు. వారి సూచనల మేరకు భక్తులు పాత దేవుడి పటాలు, విరిగిన విగ్రహాలు, ఇతర వస్తువులను వాలంటీర్లకు అందజేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎంసీ నగర ప్రజలను కోరింది.
పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్
వాటిని సేకరించిన అనంతరం వాలంటీర్ల ద్వారా చెక్క, గాజు, కాగితాలను వేరు చేస్తారు. తదనంతరం పర్యావరణానికి హాని కలగకుండా పద్ధతిగా రీసైక్లింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాలంటీర్లు స్క్రూడ్రైవర్లు, ప్లయర్స్ వంటి పరికరాలను ఉపయోగించి పటాల నుండి చెక్క ఫ్రేములు, గాజు, దేవుని చిత్రాలతో కూడిన కాగితాలను అత్యంత జాగ్రత్తగా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన వస్తువులను సంబంధిత రీసైక్లింగ్ పరిశ్రమలకు పంపిస్తారు. దీనివల్ల వ్యర్థాలుగా మారి పర్యావరణాన్ని కలుషితం చేయాల్సిన వస్తువులకు పునరుజ్జీవం లభిస్తుందని సీఎంసీ స్పష్టం చేసింది.
తదితర వివరాల కోసం ఈ కింది నంబర్లను సంప్రదించొచ్చు..
మేడ్చల్ సర్కిల్ - యోగేష్(8520958647)
మాదాపూర్ సర్కిల్ - పవన్ కుమార్(9000399452)
అల్విన్ కాలనీ సర్కిల్ - పవన్ కుమార్(9000399452)
కొంపల్లి సర్కిల్ - అరుణ్(9100028845)
నిజాంపేట్ సర్కిల్ - అరుణ్(9100028845)

సంబంధిత వార్తలు

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
సెప్టెంబర్ 22, 2026

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
సెప్టెంబర్ 22, 2026

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే



