Harish Rao | ఇల్లీగల్ అని ఎలా అంటారు?.. సిట్ చీఫ్ సజ్జనార్‌పై హరీశ్ ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉన్నప్పుడు అక్రమం అని ఎలా అంటారు?.. సిట్ చీఫ్‌పై హరీశ్ సీరియస్
Harish Rao | త్రినేత్ర.న్యూస్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ సజ్జనార్ (VC Sajjanar) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు తేల్చే వరకు అన్నీ ఆరోపణలేనని చెప్పారు. అలాంటప్పుడు అక్రమ (Illegal) ఫోన్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని, విచారణపై అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) నందినగర్ నివాసంలోని నివాసంలో సిట్ అధికారులు ఆదివారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ బృందం విచారణ ముగిసింది అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలోనే ఉన్నప్పుడు ఇల్లీగల్ ఎలా అంటారని సీపీ సజ్జనార్‌పై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను `అక్రమం` అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్‌కు లేదని, న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆరోపణను నేరంగా పరిగణించకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగ సూత్రం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేయాలేకానీ, తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా, కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలని తెలిపారు. అధికారిక సందేశాల్లో అక్రమ ట్యాపింగ్ పదప్రయోగం ద్వారా సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, చట్ట పరంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. తీర్పులు కోర్టుల ద్వారానే వెలువడాలి కానీ పోలీసుల సందేశాల ద్వారా కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ని లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా సజ్జనార్ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. పోలీసుల సందేశాలు రాజ్యాంగ పరిమితులు దాటితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని వ్యాఖ్యానించారు.
https://x.com/brsharish/status/2018188909700956292?s=46
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



