త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | ప్రజల సొమ్ముతో ఆధ్యాత్మిక రాజకీయాలా లేక ఆస్తుల వేటలా?: ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌

Dasoju Sravan | మూసీ పునరుజ్జీవంలో భాగంగా నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ (Omkareshwara Temple) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్ర ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్న‌ది.

G

Telangana | Published On Mar 28, 2026, 3.32 pm IST

Dasoju Sravan | ప్రజల సొమ్ముతో ఆధ్యాత్మిక రాజకీయాలా లేక ఆస్తుల వేటలా?: ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ పునరుజ్జీవంలో భాగంగా నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ (Omkareshwara Temple) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్ర ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్న‌ది. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (Dasoju Sravan) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేద‌వాడి బిడ్డ చ‌దువుకునే స‌ర్కారు బ‌డికి స‌రిపోను నిధులు లేవు కానీ గుడి నిర్మాణానికి రూ.700 కోట్లా అని ప్ర‌శ్నించారు. ఇదేం ప్రాధాన్య‌త ముఖ్య‌మంత్రి గారు అంటూ మండిప‌డ్డారు. ఈ ఖ‌ర్చు దేవుడిపై ఉన్న భ‌క్తి కోసామా? లేక దేవుడి మాన్యాల మీద క‌న్నేసిన వారి భుక్తి కొరకా అంటూ నిల‌దీశారు. ప్ర‌జ‌ల సొమ్ముతో ఆధ్యాత్మిక రాజ‌కీయాలా లేక ఆస్తుల వేట‌లా అని ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

8 ఎకరాల్లో ఓంకారేశ్వర ఆలయం

సుమారు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో 8 ఎకరాల్లో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో గాలి గోపురం 100 అడుగుల ఎత్తు ఉండనుంది. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించాక వేర్వేరు మండపాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, హోమాలు, పూజల నిర్వహణ కోసం ఈ మండపాలు ఉపయోగపడనున్నాయి. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపం, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. ఆలయం వద్ద రూ.199 కోట్లతో వెయ్యి నుంచి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా మూడంతస్థుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.

దిగువనున్న మూసీపై చిన్న ఆనకట్ట కట్టి నీటిని నిల్వ ఉంచడంతో పాటు నది మధ్యలో ఉన్న దీవిపై రూ.334 కోట్లతో 100 అడుగుల శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.130 కోట్లతో గుట్టపైకి వెళ్లేలా తీగల వంతెన ఏర్పాటు చేస్తారు. కాగా, రామప్ప ఆలయ నమూనాలో మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దక్షిణ కాశిగా భావించేలా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దనున్నామ‌ని వెల్లడించారు.

https://x.com/sravandasoju/status/2037808143141679465

Advertisement

తాజావార్తలు

Advertisement