KTR | వెల్‌డన్ రుషిక.. సాధించి చూపించావ్
KTR | ఎప్‌సెట్-2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా రూ.లక్ష విలువైన చెక్కును అందజేశారు.
- ఎప్‌సెట్ రాష్ట్ర మొదటి ర్యాంకర్‌కు కేటీఆర్ అభినందన
- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్కు అందజేత
KTR | త్రినేత్ర.న్యూస్: ఎప్‌సెట్-2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. చిలుకానగర్ డివిజన్‌కు చెందిన కొండల్ రెడ్డి కుమార్తె మల్లాడి రుషిక 156.63 మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా ఆ విద్యార్థినికి రూ.లక్ష విలువైన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. రుషిక విజయం చిలుకానగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని ఆమె నిరూపించిందని కొనియాడారు.
అలాగే విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థి అంకితభావం కలిసి విజయానికి పునాది అవుతాయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



