Sridhar Babu | కాలుష్యం లేని పరిశ్రమలే తీసుకొస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Sridhar Babu | బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఫార్మాసిటీ స్థానంలో కాలుష్య రహిత గ్రీన్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, సామాజిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని చెప్పారు.
- ప్రజలు కోరిందే మేం చేస్తున్నాం
- ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుల్లో మార్పు రావాలి
- లేదంటే వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయం
- మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తుంటే తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నార ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీ స్థానంలో కాలుష్య రహిత గ్రీన్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, సామాజిక మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని చెప్పారు.
అధికారం లేదని ఓరుస్తలేరు..
ప్రజలు కాలుష్యకర పరిశ్రమలు కాకుండా గ్రీన్ ఇండస్ట్రీలను కోరుకుంటున్నారు. అదే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. బీఆరెసోళ్లకు అధికారం లేదని ఓరుస్తలేరు. బద్నాం చేయాలని ఆలోచన చేస్తున్నరు. ఈరోజు పది మందికొచ్చే ఉద్యోగాలు వెయ్యిమందికొస్తాయనే ఆలోచన ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గతేడాదే కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు సీఎం చేతుల మీదుగా భూములు కేటాయించాం. హౌకోర్టుకు కూడా అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారు అని దుద్దిళ్ల పేర్కొన్నారు.
ఈ ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ పార్కును ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు వస్తే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, రిక్రియేషన్ అవసరముంటాయి. సోషల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీల ఏర్పాటుకు మేం కట్టుబడి ఉన్నాం. దాని కోసమే కార్యాచరణను రూపొందిస్తున్నాం. అలాగే ముందుకు వెళ్తాం అని మంత్రి వివరించారు.
ప్రజలు ఫార్మా సిటీని కోరలేదు..
ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుల విధానాల్లో మార్పు వస్తదని ఆశిస్తున్నాం. లేదంటే ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల్లో ఎలా ఓడిపోయారో ఇకముందు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లోనూ వారు ఓడిపోవడం ఖాయం. ఫార్మా సిటీని ప్రజలు కోరలేదు. ఇది వారు మరిచిపోతున్నారు. కాలుష్యరహిత పరిశ్రమలు రావాలని ప్రజలు కోరారు. తరచూ మేం ఢిల్లీ వెళ్లినప్పుడు చూస్తుంటాం. అక్కడ కాలుష్యంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పాఠశాలలు, ఆఫీసులకు రోజులకొద్ది సెలవులు పెట్టే పరిస్థితి ఉంటుంది అని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?




