Smooth Coated Otter | స్వచ్ఛమైన నీటి వనరులే వాటి ఆవాసాలు.. బోథ్ అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైన అరుదైన జల ప్రాణులు
Smooth Coated Otter | అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల్లో (Vulnerable Species) ఒకటి. స్వచ్ఛమైన నీరు ఉన్నచోట మాత్రమే అవి తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన జీవులు ఇప్పుడు మన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోనూ ప్రత్యక్షమయ్యాయి.
Smooth Coated Otter | త్రినేత్ర.న్యూస్: అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల్లో (Vulnerable Species) ఒకటి. స్వచ్ఛమైన నీరు ఉన్నచోట మాత్రమే అవి తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన జీవులు ఇప్పుడు మన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోనూ ప్రత్యక్షమయ్యాయి. ‘స్మూత్ కోటెడ్ ఓటెర్’లుగా (Smooth Coated Otter) పిలిచే ఈ ఉభయచరాలను బోథ్ అటవీ రేంజి పరిధిలోని సొనాల మండలం గొల్లాపూర్ చెరువు వద్ద అటవీ అధికారులు గుర్తించారు.
ఈ అరుదైన జాతి జంతువులు శుభ్రమైన నీటి వనరులు, సమృద్ధిగా చేపలు లభించే ప్రదేశాల్లో కనిపిస్తాయని ఎఫ్‌ఆర్వో ప్రణయ్ చెప్పారు. వీటిని రక్షించేందుకు చెరువు వద్ద నిరంతర పర్యవేక్షణ, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్, చైనా, మలేసియా, ఇండోనేసియాలలో వీటి సమూహాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు.
గతంలో కూడా ఈ ఉభయచరాలు హైదరాబాద్ శివార్లలో దర్శనమిచ్చాయి. 2020 మే నెలలో హిమాయత్‌సాగర్ జలాల్లో కనిపించాయి. నీటిపైనా, నేలమీదా ఉండగలిగే స్మూత్ కోటెడ్ ఓటెర్‌ను నీటి కుక్క అని కూడా పిలుస్తారు.
అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న స్మూత్ కోటెడ్ ఓటర్‌లు మంచి నీరు ఉన్న చోటమాత్రమే ఉంటాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇది 1996 నుంచి IUCN రెడ్ లిస్ట్‌లో అంతరించిపోతున్న జాతుల్లో ఉంది. వాతావరణ కాలుష్యం, పరిశ్రమల వల్ల స్వచ్ఛమైన నీరు ఎక్కువగా ఉండకపోవడం, చిత్తడి నేలల కాలుష్యం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం కోసం వేటాడటం వంటి ముప్పు పొంచి ఉండటంతో వీటిని ఆ జాబితాలో చేర్చారు. ఇవి 7 నుంచి 11 కిలోల బరువు, 59 నుంచి 64 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






