Vatte Janaiah Yadav | అత్యంత విషమంగా వట్టే జానయ్య ఆరోగ్యం.. గాంధీలో చికిత్స!
Vatte Janaiah Yadav | తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ (Vatte Janaiah Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా దవాఖాన నుంచి హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కి (Gandhi Hospital) తరలించారు.
Vatte Janaiah Yadav | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ (Vatte Janaiah Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా దవాఖాన నుంచి హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కి (Gandhi Hospital) తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గాంధీ హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్టే జానయ్య యాదవ్ సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీచేసిన విషయం తెలిసిందే. ఆ సయంలో ఆయనపై ప్రత్యర్థులు దాడిచేశారు. ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా దుండగులు వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. అయితే వట్టే జానయ్య తృటిలో తప్పించుకోగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడిగా బీఆర్ఎస్‌లో కొనసాగిన ఆయన, విభేదాల నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా బరిలో నిలిచారు.

తాజావార్తలు
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి
- ●DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?






