TRP | జూలై 5న రాజ్యాధికార సమరభేరి.. భువనగిరిలో లక్షలాది మందితో సభ: టీఆర్‌పీ
TRP | బీసీల రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) వచ్చే నెల 5న భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లక్షలాది మందితో సభ నిర్వహించి బీసీల సత్తాచాటుతామని నేతలు అన్నారు.
TRP | త్రినేత్ర.న్యూస్: బీసీల రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) వచ్చే నెల 5న భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లక్షలాది మందితో సభ నిర్వహించి బీసీల సత్తాచాటుతామని నేతలు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాధికార సమరభేరి సభకు (Rajyadhikara Sabha) సంబంధించిన ఆహ్వాన పత్రికను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దేవులపల్లి సమ్మయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమంలో బీసీ మేధావులు, ఉద్యోగులు, కార్మికులు కర్షకులు, రైతులు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా సాగుతున్న బీసీల రాజ్యాధికార సాధనకు ఇప్పుడు కీలక దశ వచ్చిందని, లక్ష్య సాధనకు ఇంకొంచెం దూరంలోనే ఉన్నామని చెప్పారు.
ఈ సభ ద్వారా బీసీల శక్తిని, ఐక్యతను రాష్ట్రానికి తెలియజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ (Vatte Janaiah) అన్నారు. లక్షలాది మంది ప్రజలతో సభను విజయవంతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ చారి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి

Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!






