Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం
Vakiti Srihari | పరిశ్రమల (Industries) ఏర్పాటుకు సింగిల్ విండో విధానం (Single Window System)లో యుద్ధప్రాతిపదికన అనుమతులు మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు.
- పౌల్ట్రీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం
- మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
- పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 నాలెడ్జ్ డే కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: పరిశ్రమల (Industries) ఏర్పాటుకు సింగిల్ విండో విధానం (Single Window System)లో యుద్ధప్రాతిపదికన అనుమతులు మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. పౌల్ట్రీ రంగ (Poultry Sector) అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ రంగంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 నాలెడ్జ్ డే కార్యక్రమంలో వాకిటి శ్రీహరి మాట్లాడారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పౌల్ట్రీ రంగ పారిశ్రామికవేత్తలకు, నిపుణులకు ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా పౌల్ట్రీ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మహిళలు ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, పౌల్ట్రీ రంగ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పరిధిలోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మొదటి స్థానంలో నిలబెడతాం
ప్రస్తుతం పౌల్ట్రీ రంగంలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. వచ్చే పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నాటికి తెలంగాణ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తనకు కూడా పౌల్ట్రీ రైతుగా మారాలనే ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలుగా ఉందని మంత్రి తెలిపారు. ఈ వేదికగా అచ్యుత్ రామ్‌ను పౌల్ట్రీ రంగంలోకి ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. పౌల్ట్రీ రంగ ప్రముఖులు ఆయనకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని కోరారు.
పౌల్ట్రీ పరిశ్రమ అంతగా విస్తరించని ప్రాంతాల్లో మహిళలను సంఘటితం చేసి, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో పౌల్ట్రీ రంగ విస్తరణకు, నూతన పెట్టుబడులకు, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి వాకిటి పునరుద్ఘాటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు
నవంబర్ 24, 2026

Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది
నవంబర్ 24, 2026

Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు
- ●Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి
- ●Harish Rao vs Revanth Reddy Krishna Waters | అవి పచ్చి అబద్ధాలు.. ఇవిగో అసలు వాస్తవాలు
- ●Black Hole | రాకాసి కృష్ణబిలం.. సూరుడి కంటే 36 కోట్ల రెట్లు భారీగా..!
- ●Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది
- ●Shruti Haasan | మూడేళ్ల తర్వాత హీరోయిన్గా శృతిహాసన్‌కు ఛాన్స్

Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు

Thiruparankundram | తిరుపరంకుండ్రం కొండపై ఉద్రిక్తత.. దీపస్తంభం వద్ద వెలగని జ్యోతి

Harish Rao vs Revanth Reddy Krishna Waters | అవి పచ్చి అబద్ధాలు.. ఇవిగో అసలు వాస్తవాలు

Black Hole | రాకాసి కృష్ణబిలం.. సూరుడి కంటే 36 కోట్ల రెట్లు భారీగా..!



