V Srinivas Goud | సాగరహారం జరిగిన రోజే సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీటింగ్
సిరిసిల్ల పర్యటన దండయాత్రలా సాగిందంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
సంక్షిప్త సారాంశం
సిరిసిల్ల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా నిర్బంధించి రేవంత్ రెడ్డి పర్యటించారని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, కృష్ణా జలాల తరలింపు, సింగరేణి బొగ్గు వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో రంగనాథ్ హైడ్రా నడిపిస్తే, కొడంగల్‌లో తిరుపతి రెడ్డి హైడ్రా పేద ప్రజల ఇళ్లను కూలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగులున్న అశోక్‌నగర్‌కు కాంగ్రెస్ మంత్రులు వచ్చే సాహసం చేయగలరా అని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు.
- రేవంత్ రెడ్డిది పర్యటన కాదు దండయాత్ర
- పోలీసుల్లేకుండా పాదయాత్ర చేసే దమ్ముందా?
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్
V Srinivas Goud | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఒక దండయాత్రలా సాగిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్లలో పర్యటించేందుకు వెళ్తూ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేష్ కుమార్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలైన కొడంగల్, మధిరలకు వెళ్లిన సందర్భాల్లోనూ అభివృద్ధి పనులకు సమృద్ధిగా నిధులు కేటాయించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మంత్రులు ఎవరి దందాలో వారు మునిగిపోయారని, ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ నీళ్లు, బొగ్గు హక్కుల తాకట్టు
తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. "కృష్ణా బేసిన్ నుంచి నీళ్లను పెన్నా బేసిన్‌కు తరలిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు ఏకంగా లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు? సింగరేణి బొగ్గు ఎక్కడికి తరలిపోతోందో సమాధానం చెప్పాలి" అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమ సభలను అడ్డుకున్న తరహాలోనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బందోబస్తు మధ్య సభలు నిర్వహిస్తోందని విమర్శించారు.
"దమ్ముంటే పోలీసుల రక్షణ లేకుండా పాదయాత్ర చేసి ప్రజలను కలవండి.. అప్పుడు తెలుస్తుంది ప్రజల ఆగ్రహం ఏంటో! కాంగ్రెస్ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులుండే అశోక్ నగర్‌కు వెళ్లగలరా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకొచ్చి నిరుద్యోగ డిక్లరేషన్ సభ పెట్టగలరా?" అంటూ శ్రీనివాస్ గౌడ్ నేరుగా సవాల్ విసిరారు.
కొడంగల్‌లో 'తిరుపతి రెడ్డి హైడ్రా': పట్నం నరేందర్ రెడ్డి ఫైర్
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గం కొడంగల్‌కే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వెళ్లి ఏం చేస్తారని నిలదీశారు. "హైదరాబాద్‌లో కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా నడుస్తుంటే.. కొడంగల్‌లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి హైడ్రా నడిపిస్తున్నారు. రోడ్ వైడనింగ్ పేరుతో రాయలసీమ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతూ స్థానిక పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్ పేరిట గిరిజనుల నుంచి భూములు లాక్కున్నారు. కేటీఆర్, హరీష్ రావు.. సిరిసిల్ల, సిద్దిపేటలను ఎలా అభివృద్ధి చేశారో రేవంత్ కళ్లారా చూసి నేర్చుకోవాలి" అని విమర్శించారు.
మూడేళ్లలో కొత్త పెన్షన్ లేదు: చిరుమళ్ల రాకేష్
కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని, గురుకుల టెండర్లను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
రేవంత్ రెడ్డి దండయాత్రలు కాదు - పోలీసుల్లేకుండా పాదయాత్ర చేయాలి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.....
సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లినట్లు… pic.twitter.com/QdjveI3g63
— V Srinivas Goud (@VSrinivasGoud) September 30, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!
- ●Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్
- ●Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!
- ●Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!

Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్

Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!

Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం






