Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!
Sreeleela | టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం పెళ్లి కంటే కెరీర్‌పైనే దృష్టి పెడుతోంది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తాజాగా మరోసారి స్పష్టం చేసింది. గతంలోనూ మరికొన్ని సంవత్సరాల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పిన ఆమె.. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తనకు నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటానని తెలిపింది.
Entertainment | Published On Sep 30, 2026, 8.00 pm IST
Sreeleela | టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం పెళ్లి కంటే కెరీర్‌పైనే దృష్టి పెడుతోంది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తాజాగా మరోసారి స్పష్టం చేసింది. గతంలోనూ మరికొన్ని సంవత్సరాల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పిన ఆమె.. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తనకు నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటానని తెలిపింది. కొంతకాలంగా శ్రీలీలను ఓ యువ బాలీవుడ్ నటుడితో లింక్ చేస్తూ పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని తేలిపోయాయి. తాజాగా మరోసారి పెళ్లిపై స్పందించిన శ్రీలీల.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో తన పెళ్లిపై వస్తున్న ప్రచారానికి ఆమె చెక్ పెట్టినట్లయింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని చెప్పకనే చెప్పింది.
వరుస అవకాశాలతో..
కన్నడలో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల.. ‘పెళ్లిసందD’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ సరసన నటించిన ఈ చిత్రంతో శ్రీలీలకు టాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరిగింది. అనంతరం భగవంత్ కేసరి, స్కంద, గుంటూరు కారం, రాబిన్‌హుడ్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్‌లోనూ కథానాయికగా కనిపించింది. పుష్ప 2లో ప్రత్యేక గీతంలో సందడి చేసి మరింతగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో కొంతకాలం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగింది శ్రీలీల. అయితే, ఇటీవల సినిమాల ఎంపికలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తోంది. కథ, పాత్ర తనకు నచ్చితేనే ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
ఇతర భాషల్లోనూ..
ప్రస్తుతం శ్రీలీల తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతోంది. ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంలో మమ్ముట్టి, సాయిపల్లవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ తన కెరీర్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో శ్రీలీల వరుసగా కథలు వింటున్నట్లు సమాచారం. దీంతో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీల ఏ చిత్రంలో నటిస్తున్నది క్లారిటీ లేదు. కొత్త కథలు వింటున్నప్పటికీ.. తొందరపడి సినిమాలను అంగీకరించకుండా పాత్ర, కథకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాలీవుడ్‌లో తన తదుపరి అడుగుపై ఆలోచిస్తోంది. మొత్తానికి పెళ్లి వార్తలకు శ్రీలీల మరోసారి చెక్ పెట్టింది. ప్రస్తుతానికి తన జీవితంలో పెళ్లి కంటే కెరీర్‌కే ప్రాధాన్యం ఇస్తున్న ఈ భామ.. మరిన్ని మంచి పాత్రలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక రాబోయే సినిమాలతో శ్రీలీల ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్
- ●Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!
- ●V Srinivas Goud | సాగరహారం జరిగిన రోజే సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీటింగ్
- ●Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్

Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!

V Srinivas Goud | సాగరహారం జరిగిన రోజే సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీటింగ్

Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం





