Bindaas Song | జైలర్ 2 మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే డ్యాన్స్‌తో దుమ్మురేపిన నోరా..!
Bindaas Song | సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం నుంచి ‘బిందాస్’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Entertainment | Published On Sep 30, 2026, 7.41 pm IST
Bindaas Song | సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం నుంచి ‘బిందాస్’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘బిందాస్’ పాటలో నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో సందడి చేశారు. రాజభవనం తరహా భారీ సెట్స్‌లో ఆమె వేసిన స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాట మొత్తంలో నోరా కనిపిస్తూ తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించింది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ పాటకు మరింత జోష్‌ను తీసుకొచ్చింది. ‘జైలర్’ (2023)లో తమన్నా భాటియా చేసిన ‘కావాలా’ పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో తెలిసిందే. అదే తరహా మాస్ బీట్, డ్యాన్స్ నంబర్‌గా ‘బిందాస్’ను రూపొందించినట్లు పాటను చూస్తే అర్థమవుతోంది. ఈసారి నోరా ఫతేహి డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది.
పాటలో రజనీ ఎంట్రీ
‘బిందాస్’ వీడియోలో రజనీకాంత్ కూడా కొద్దిసేపు కనిపించారు. పాట సినిమాలో ఏ సందర్భంలో వస్తుందనే విషయంపై మాత్రం మేకర్స్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో నోరా డ్యాన్స్‌తోపాటు రజనీకాంత్ కనిపించిన సన్నివేశాలు పాటపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ‘జైలర్ 2’కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజనీకాంత్ సినిమాకు ఆయన సంగీతం అందించడం ఇది ఆరోసారి. ‘బిందాస్’ పాటకు సూపర్ సుబు సాహిత్యం అందించగా.. అనిరుధ్, దీప్తి సురేశ్ గాత్రం అందించారు. పూర్తి సౌండ్‌ట్రాక్‌ను ప్రత్యేకంగా నిర్వహించనున్న ‘రేవ్’ ఈవెంట్ అనంతరం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్ ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
భారీ తారాగణంతో ‘జైలర్ 2’
‘జైలర్’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, మీర్నా మీనన్, యోగిబాబు, జాఫర్ సాదిక్ తదితరులు తమ పాత్రల్లోనే కనిపించనున్నారు. విద్యాబాలన్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజారమూడు, భగవతి పెరుమాళ్, తమిళ్, జతిన్ సర్నా, మేఘనా రాజ్ సర్జా, బ్జోర్న్ సుర్రావ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!
- ●Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్
- ●V Srinivas Goud | సాగరహారం జరిగిన రోజే సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీటింగ్
- ●Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Sreeleela | దానికి ఇంకా టైముంది.. కెరీర్‌పైనే శ్రీలీల దృష్టి..!

Hyderabad Airport Drugs Seizure | విదేశీ చాక్లెట్లలో రూ.24.5 కోట్ల కొకైన్

V Srinivas Goud | సాగరహారం జరిగిన రోజే సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీటింగ్

Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం





