Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టుకు డిసెంబర్‌లో శంకుస్థాపన
Warangal Airport | తెలంగాణలోని ఆదిలాబాద్, మామూనూరు(వరంగల్) ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- రెండు వారాల్లో టెండర్లకు పిలుపు
Warangal Airport | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ఆదిలాబాద్, మామూనూరు(వరంగల్) ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మామూనూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణను పూర్తి చేసి ఇచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆదిలాబాద్‌లో రన్‌వే ఫైనలైజ్ చేయడానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎయిర్‌పోర్టు టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు.
తెలంగాణలో చాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
సెప్టెంబర్ 12, 2026

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



