Kishan Reddy | కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఆగవు.. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy | తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి ఢిల్లీలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విషయంలో ఫిఫ్టి ఫిఫ్టి నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనవి చేస్తున్నా. మెట్రో ఫేజ్ -1కు కూడా కేంద్రం రూ. 1250 కోట్లు ఇచ్చింది. చివరకు మెట్రో పేజ్-1 పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అనేక మెట్రోలకు 2, 3 దశల్లో సహకరం అందించినట్టే హైదరాబాద్‌కు కూడా అదే విధంగా సాంకేతికంగా, ఆర్థికంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించాం. కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఆగవు. రేవంత్ రెడ్డి అనాలోచితంగా, దుందుడుకుగా మాట్లాడడం సరికాదు అని కిషన్ రెడ్డి సూచించారు.
నేను రేవంత్‌కు జవాబుదారీ కాదు..
తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. నాకు గానీ కేంద్రానికి గానీ మోదీకి గానీ రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. నేను రేవంత్‌కు జవాబుదారీ కాదు. తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి జవాబుదారీ నేను. మోదీ నాయకత్వంలో 12 ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేశాం.. చేస్తున్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం.. జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వేల అభివృద్ధికి ఎప్పటికప్పుడు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
బిల్లు పాసైన తర్వాత దీక్ష విరమించాను
అంతేకాకుండా నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్లను ఒప్పించినట్లు రేవంత్ రెడ్డి చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాను. రాజ్యసభ, లోక్‌సభలో బిల్లు పాస్ కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేశాను. బిల్లు పాసైన తర్వాత దీక్ష విరమించాను అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఇవన్నీ రేవంత్ కోరితే చేయలేదు..
తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మాకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కావొచ్చు.. రూ. లక్షా 75 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి కావొచ్చు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు కేంద్రం అభివృద్ధి చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తున్నాం. రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ. 350 కోట్లతో నాంపల్లి అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ రేవంత్ కోరితే చేయలేదు. కేంద్ర బాధ్యతగా పని చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం





