H-FAST | మటన్‌లో బీఫ్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
H-FAST | నగరంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో కల్తీ మాంసం వ్యవహారం కలకలం సృష్టించింది. హెచ్ ఫాస్ట్ బృందం పోలీసులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపుగా 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
H-FAST | నగరంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో కల్తీ మాంసం వ్యవహారం కలకలం సృష్టించింది. హెచ్ ఫాస్ట్ బృందం పోలీసులతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపుగా 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మల్లేపల్లిలోని బడీ మసీదు సమీపంలో ఉన్న ఉస్మాన్ మీట్ షాప్‌లో వినియోగదారులకు కల్తీ మాంసం విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో మేక మాంసంలో గోమాంసం కలిపి విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ మేరకు స్టాక్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. మేక మాంసమా? బీఫ్ కలిపారా అనేది ల్యాబ్ నివేదికతోనే తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో హబీబ్‌నగర్ పోలీసులు షాప్ యజమాని ఉస్మాన్ ఖురేషిపై కేసు నమోదు చేశారు. ఈ కల్తీ ఎంతకాలంగా జరుగుతోంది? ఇందులో ఎవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
- ●DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
- ●IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?

DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి




