త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు క‌లే.. రాహుల్ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాప‌త్రయం

Bandi Sanjay | బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అనేది క‌లే అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాప‌త్ర‌యం చెందుతున్నార‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 21, 2026, 3.09 pm IST

Bandi Sanjay | బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు క‌లే.. రాహుల్ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాప‌త్రయం
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అనేది క‌లే అని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాప‌త్ర‌యం చెందుతున్నార‌ని పేర్కొన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో బండి సంజ‌య్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయం. దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు వెనుక అసలు కుట్ర ఇదే. జమిలి ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుందనే భయం రేవంత్‌కు పట్టుకుంది. రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదు కాబట్టే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ డ్రామాలు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినే. మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ తప్పు చేశాయి. ఆ పార్టీల దృష్టిలో మహిళలంటే సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమొళి మాత్రమే. వాళ్లకు పదవులిస్తే మహిళలకు న్యాయం జరిగినట్లేనని భావిస్తున్నారు అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

సాధారణ మహిళలు చట్టసభల్లోకి వస్తే... కుటుంబ పార్టీల పునాదులు కదిలిపోతాయనే భయం. అందుకే మహిళా భిల్లును అడ్డుకున్నాయి. గంట టైమిస్తే డీలిమిటేషన్ బిల్లును సవరిస్తానని అమిత్ షా చెప్పారు. అయినా వినకుండా ద‌క్షిణాదికి తీరని ద్రోహం చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకుంటే ఆదుకుంది బీజేపీ. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement