త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తే నేను రాజీనామా చేస్తా : బండి సంజ‌య్

Bandi Sanjay | తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమ‌లు చేశామ‌ని ఇత‌ర రాష్ట్రాల్లో గొప్ప‌లు చెప్పుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Apr 4, 2026, 3.57 pm IST

Bandi Sanjay | ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తే నేను రాజీనామా చేస్తా : బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమ‌లు చేశామ‌ని ఇత‌ర రాష్ట్రాల్లో గొప్ప‌లు చెప్పుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని బండి సంజ‌య్ చెప్పారు. ఒకవేళ అమ‌లు కాక‌పోతే సీఎం రేవంత్ రాజీనామా చేస్తాడా అని స‌వాల్ విసిరారు.

కేరళం ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి అబద్దాల వల్లే గతంలో బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. తెలంగాణలోని ఏ గ్రామానికైనా కేరళం మీడియాను తీసుకెళ్దాం.. ఆరు గ్యారెంటీలు అమ‌ల‌వుతున్నాయో లేదో అడుగుదాం. ఒకవేళ అమ‌లు కాక‌పోతే సీఎం రేవంత్ నా సవాల్‌ను స్వీక‌రించి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని బండి సంజ‌య్ అన్నారు.

Advertisement
Advertisement