Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను న్యాయస్థానం ఎత్తివేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు.
Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను న్యాయస్థానం ఎత్తివేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు.
కోర్టు విధించిన స్టేను కొందరు రాజకీయ కోణంలో చూస్తూ పథకాలు రద్దయినట్లు ప్రచారం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. న్యాయస్థానం తీర్పును వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మరోసారి స్పష్టం చేసినట్లు పొన్నం తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



