Kalvakuntla Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండె ధైర్యం లేదు : మాజీ ఎమ్మెల్సీ కవిత
Kalvakuntla Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోంది అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది అని ఆమె విమర్శించారు.
190 జీవోను వెంటనే అమలు చేయాలి
లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోంది అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది అని ఆమె విమర్శించారు.
317 జీవోకు సంబంధించి దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ కమిటీ 317 జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చింది. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదు. ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను అమలు చేయటం లేదో చెప్పాలి. ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేస్తామని చెప్పి వారిని ఇబ్బంది పెడుతున్నారు. 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వారిని స్వస్థలాకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారు. జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదు అని ఆమె పేర్కొన్నారు.
అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి
జీవో 25 రేషనలైజేషన్‌తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలి. అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. వారికి అండగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది. ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున మేము పోరాడుతాం. వెంటనే 190 జీవోను అమలు చేయాలి. లేదంటే తెలంగాణ రక్షణ సేన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్
- ●Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమలు సహకరించాలి : MEAI చైర్మన్ వినయ్ కుమార్
- ●Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్గా మిస్ ఇండియా ఫైనలిస్ట్ - ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి

KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్



