త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వార్డు మెంబ‌ర్ కూడా కాని.. తిరుప‌తి రెడ్డికి రూ. 40 కోట్ల‌తో భ‌ద్ర‌త అవ‌స‌ర‌మా..?

Harish Rao | ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిల‌దీశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని నీ తమ్ముడు తిరుపతి రెడ్డికి న‌లుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ. 40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Sep 6, 2026, 6.50 pm IST

Harish Rao | వార్డు మెంబ‌ర్ కూడా కాని.. తిరుప‌తి రెడ్డికి రూ. 40 కోట్ల‌తో భ‌ద్ర‌త అవ‌స‌ర‌మా..?
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప్రతిపక్ష నాయకుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ భద్రత మీద రేవంత్ రెడ్డికి ఏడుపెందుకు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిల‌దీశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని నీ తమ్ముడు తిరుపతి రెడ్డికి న‌లుగురు గన్‌మెన్లు పెట్టి, భద్రత కోసం రూ. 40 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ముగిసిన అనంత‌రం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

పక్క రాష్ట్రం ఏపీలో మాజీ సీఎంలకు భద్రత కల్పించడం లేదా..? చరిత్రలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి నేతల పట్ల అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినప్పుడు.. వాళ్లు సభను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రులుగా సభలోకి అడుగుపెట్టిన చరిత్ర ఉంది. కేసీఆర్ పట్ల కూడా కాంగ్రెస్ అలాగే ప్రవర్తిస్తోంది కాబట్టి ప్రజల నుంచే బుద్ధి చెబుతామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఎవ‌డైనా చావును కోరుకుంటారా..

పొద్దున లేస్తే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ చావును కోరుకునే రేవంత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. ఎవ‌డైనా చావును కోరుకుంటారా.. కేసీఆర్ చావును కోరుకుంటూ స‌భ్య స‌మ‌జం త‌ల‌దించుకునేలా రేవంత్ మాట్లాడే భాష‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. విలువ‌లు లేని చోట‌, మ‌ర్యాద లేని చోట‌, కౌర‌వ స‌భ‌గా మారిన చోటుకు కేసీఆర్ రావాల్సిన అవ‌స‌రం లేద‌ని మేమంతా అభిప్రాయ‌ప‌డ్డాం. ప్ర‌భుత్వం పెట్టే చ‌ర్చ‌కు బీఆర్ఎస్ స‌మాధానం ఇస్త‌ది అని హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు..

ఇందిరా పార్కులో మంత్రులు ధ‌ర్నా చేయ‌డం ఏంటి..? అక్క‌డ రోజుకు నాలుగు ధ‌ర్నాలు అవుతున్నాయి. ఆశావ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, వీఆర్ఏలు, ప్ర‌భుత్వ ఉద్యోగులు ధ‌ర్నాలు చేస్తున్నారు.. వారి ధ‌ర్నాల‌కు స‌మాధానం చెప్పండి. చిల్ల‌ర డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ వ‌ద్దు. ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు.. ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement