త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ జరగాలి: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud | కేసీఆర్‌ కుటుంబానికి చెందిన భూములపై తప్పనిసరిగా విచారణ జరగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ కుటుంబం భూముల వ్యవహారంపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని చెప్పారు.

P

Telangana | Published On Sep 17, 2026, 8.26 pm IST

Mahesh Kumar Goud | కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ జరగాలి: మహేశ్‌కుమార్‌ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | కేసీఆర్‌ కుటుంబానికి చెందిన భూములపై తప్పనిసరిగా విచారణ జరగాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మీడియాతో ఆఫ్‌ ది రికార్డ్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ కుటుంబం భూముల వ్యవహారంపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగిందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌కు గతంలో ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసినవారు కూడా బాగానే పనిచేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన భూముల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్రంగా వెల్లడించారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

2004, 2009 ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్‌కు భూములు లేవని పేర్కొన్నారని చెప్పారు. 2014 నాటికి కేసీఆర్‌ పేరిట 35 ఎకరాల భూములు వచ్చాయని.. 2018లో భూముల విస్తీర్ణం మరింత పెరిగిందని తెలిపారు. 2023 ఎన్నికల అఫిడవిట్‌లో 53 ఎకరాలు చూపించారని చెప్పారు. 2023 నాటికి కేటీఆర్‌ కుటుంబం పేరిట మొత్తం 123 ఎకరాల భూములు ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. 2026లో కేటీఆర్‌ మరో 67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాల మధ్య పొంతన కనిపించడం లేదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. 22–ఏ భూముల విషయంలో అధికారుల స్థాయిలో ఎక్కడైనా తప్పిదాలు జరిగి ఉండవచ్చని.. వాటిపైనా విచారణ జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి లేదా మంత్రుల స్వార్థ ప్రయోజనాల కోసం 22–ఏ నిబంధనను తీసుకురాలేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ తల్లిని ఉద్దేశించి ఉపయోగించిన భాష సమంజసం కాదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు కూడా సరికాదని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి, నివాస అవసరాల కోసం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో గజం భూమి కూడా లేని పేదలు ఉన్నారని.. కేసీఆర్‌ కుటుంబానికి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వారిని వ్యక్తిగతంగా బద్నాం చేయడం తమ ఉద్దేశం కాదని.. వాస్తవాలను ప్రజల ముందుంచడమే తమ లక్ష్యమని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దళితులు, బీసీల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోందని చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ తనది కాదని కేటీఆర్‌ చెబుతున్నారని.. కానీ ఆయన అక్కడే ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. నిర్మాణాలకు అనుమతి లేని ప్రాంతంలో జన్వాడ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని ఆరోపించారు. ఎవరి ప్రైవేట్‌ ఆస్తులను ప్రభుత్వం లాక్కోదని స్పష్టం చేశారు. గతంలో ఢిల్లీలో కేసీఆర్‌ నివసించిన ఇంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ తలుపులు ఏర్పాటు చేశారని.. అదేవిధంగా ప్రగతిభవన్‌లోనూ బుల్లెట్‌ ప్రూఫ్‌ తలుపులు అమర్చారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
Advertisement