త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ‘ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్రలో జీవించావు..

Harish Rao | ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్ రావును ఆయన నివాసంలో బుధ‌వారం ఉద‌యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.

S

Telangana | Published On Sep 30, 2026, 12.45 pm IST

Harish Rao | ‘ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్రలో జీవించావు..
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్ రావును ఆయన నివాసంలో బుధ‌వారం ఉద‌యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.

ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో.. మనం తెలంగాణ సాధనలో చూశామని ఈ సందర్భంగా హరీశ్ రావు గారు గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ఇటీవల వచ్చిన ప్యారడైజ్ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని, ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి జీవించారని ఆయన కొనియాడారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు. ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు. ప్యారడైజ్ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement