త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని 240 కి.మీ పాద‌యాత్ర‌.. ఎర్ర‌వ‌ల్లికి చేరుకున్న పాల‌మూరు అభిమాని

KCR | కేసీఆర్ (KCR) మ‌ళ్లీ సీఎం కావాల‌ని ఇటీవల పలువురు అభిమానులు పాద‌యాత్ర చేయ‌గా తాజాగా పాల‌మూరుకు చెందిన అభిమాని తిరుప‌త‌య్య సైతం ఐదు రోజులు పాద‌యాత్ర (Foot March) చేసి శుక్ర‌వారం ఎర్ర‌వ‌ల్లి (Erravally) కి చేరుకున్నారు.

S

Telangana | Published On Nov 27, 2026, 7.04 pm IST

KCR | కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని 240 కి.మీ పాద‌యాత్ర‌.. ఎర్ర‌వ‌ల్లికి చేరుకున్న పాల‌మూరు అభిమాని
Advertisement

KCR | త్రినేత్ర న్యూస్‌: కేసీఆర్ (KCR) మ‌ళ్లీ సీఎం కావాల‌ని ఇటీవల పలువురు అభిమానులు పాద‌యాత్ర చేయ‌గా తాజాగా పాల‌మూరుకు చెందిన అభిమాని తిరుప‌త‌య్య సైతం ఐదు రోజులు పాద‌యాత్ర (Foot March) చేసి శుక్ర‌వారం ఎర్ర‌వ‌ల్లి(Erravally) కి చేరుకున్నారు. 240 కిలోమీట‌ర్లు న‌డిచి త‌మ అభిమాన నేత‌ను క‌లుసుకున్నారు. అనంత‌రం ఆశీస్సులు తీసుకున్నారు.

మహబూబ్ నగర్ (Mahaboobnagar) జిల్లా నవాబ్ పేట్ మండలం దయపంతులపల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గండు తిరుపతయ్య (Gandu Tirupathaiah) 5 రోజుల క్రితం ఫత్తేపురం మైసమ్మ దర్శనం చేసుకొని పాదయాత్ర ప్రారంభించారు. శుక్ర‌వారం సిద్దిపేట జిల్లాలోని ఎర్ర‌వ‌ల్లికి చేరుకొని కేసీఆర్‌ను కలిశారు.

పాదయాత్ర వివరాలను, యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు రావడం లేదని, నీళ్లు, కరెంటు లేక తన మూడెకరాల పొలం ఎండిపోయిందని ఈ సంద‌ర్భంగా తిరుప‌త‌య్య వాపోయాడు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ బాగుపడుతుందని భావోద్వేగం చెందారు.

Advertisement
Advertisement