త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | అయోధ్య ట్ర‌స్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు

Chamala Kirankumar Reddy | అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని.. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ నేత‌లు చెప్పాలని భువ‌న‌గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. యూపీ సీఎం పదవికి యోగీ ఆడిత్యనాథ్‌ రాజీనామా చేయాలన్నారు.

S

Telangana | Published On Jun 26, 2026, 5.22 pm IST

Chamala Kirankumar Reddy | అయోధ్య ట్ర‌స్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
Advertisement
  • వ‌సూలైన డ‌బ్బుతో ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి
  • ఇది యూపీ విష‌యమే కాదు.. దేశం మొత్తానికి సంబంధించింది
  • యూపీ సీఎం యోగి రాజీనామా చేయాలి
  • ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని.. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ నేత‌లు చెప్పాలని భువ‌న‌గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్‌ ప్రజలకు వాస్తవాలు చెప్పాల‌న్నారు. ట్రస్ట్ విరాళాల అవకతవకలపై శుక్ర‌వారం ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. యూపీ సీఎం పదవికి యోగీ ఆడిత్యనాథ్‌ రాజీనామా చేయాలన్నారు.

ఒక్కొక్క‌రికి రూ.75 కోట్లిచ్చి కొన్నరు..

అయోధ్య రామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్‌కు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదని కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. కానీ యూపీ సిట్ పోలీసులు చంపత్ రాయ్ మనుషులను అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారు. చంపత్ రాయ్‌ను ట్రస్ట్ కార్యదర్శి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారు. యూపీ సీఎం పదవికి యోగీ ఆడిత్యనాథ్‌ రాజీనామా చేయాలి. ఇది యూపీకి సంబంధించిన వ్యవహారం కాదు. దేశ ప్రజలకు సంబంధించిన అంశం. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎంపీలను 20 మందిని, మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ థాక్రే ఎంపీల‌ను 6 మందిని ఒక్కొక్కరికి రూ.75 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసింది అని చామ‌ల‌ ఆరోపించారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాను పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకుంటే సరిపోదు. దేశంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ప్రజలు దేవుడి కోసం డబ్బులు ఇచ్చారు. మీరు దోచుకోవడం కోసం కాదు అని కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఫైర‌య్యారు.

 

Advertisement
Advertisement