త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | ఆర్ఎస్పీని చంప‌డానికే సెక్యూరిటీ తీసేశారు

Srinivas Goud | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తీసేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని.. ఆయ‌న్ను చంపడానికే ఏదైనా ప్రయత్నం చేశార‌నే అనుమానం కలుగుతోంద‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కేమైనా ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

S

Telangana | Published On Jun 26, 2026, 7.30 pm IST

Srinivas Goud | ఆర్ఎస్పీని చంప‌డానికే సెక్యూరిటీ తీసేశారు
Advertisement
  • అలాంటి ప్ర‌య‌త్నం చేశార‌నే అనుమానం వ‌స్తోంది
  • ఆయ‌న బ‌తికినంత‌కాలం సెక్యూరిటీ ఇవ్వాల‌ని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది
  • సెక్యూరిటీ తీసేయ‌డం ఆర్టిక‌ల్ 14కు విరుద్ధం కూడా
  • ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుందో?
  • ఆయ‌న‌కేమైనా పూర్తి బాధ్య‌త‌ ప్ర‌భుత్వానిదే
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ తీవ్ర ఆరోప‌ణ‌లు

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తీసేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని.. ఆయ‌న్ను చంపడానికే ఏదైనా ప్రయత్నం చేశార‌నే అనుమానం కలుగుతోంద‌ని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బ‌తికినంత కాలం సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఇంటెలిజెన్స్ కూడా నివేదిక ఇచ్చింద‌ని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14కు విరుద్ధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. ఆయ‌న‌కేమైనా ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. మేం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల సెక్యూరిటీ తీసేస్తే భవిష్యత్‌లో ఇండ్ల‌ల్లో ఉండ‌లేర‌ని, ఊర్లలో తిరగలేరని హెచ్చ‌రించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు.

మావోయిస్టులున్న నియోజ‌క‌వ‌ర్గంలో...

కాంగ్రెస్ హ‌యాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్థవంతంగా పనిచేశాడు. అందుకే ఆయనకు త్రెట్టు ఉంది. ఆయన బ‌తికినంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చింది. రాష్ట్రపతి అవార్డు, సెక్యూరిటీ అవార్డు పొందిన ప్రవీణ్ కుమార్‌కే సెక్యూరిటీ తీసేస్తే ఎలా? సిర్పూర్ కాగజ్‌నగర్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం. ఆయ‌న‌కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. సెక్యూరిటీ తీసేస్తుంటే IPS అధికారుల సంఘం ఏం చేస్తున్నట్లు? కొంతమంది IPS అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. హైదరాబాద్ చుట్టు పక్కల కొంత మంది IPS అధికారులు ఇష్టానుసారంగా భూములు కొనుగోలు చేశారు అని శ్రీ‌నివాస్‌గౌడ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

పొలిటిక‌ల్ ఇంటెన్స్‌తోనే తీసేశారు..

పొలిటికల్ ఇంటెన్స్‌తోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సెక్యూరిటీ తీసేశారు. సెక్యూరిటీ తొలిగించడం సరైంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసహనంతో రూల్స్‌కు విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అనేక అవార్డ్స్ వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకుల సెక్రటరీగా పని చేశారు అని ఆయ‌న గుర్తు చేశారు.

కోర్టులు కూడా ఒప్పుకోవు..

రాజ్యాంగంలో ఆర్టికల్ 21 సైతం త్రెట్టు ఉన్న అధికారులకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్తుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్‌కు సెక్యూరిటీ పెంచాల్సింది పోయి తీసేయడం ఎంత వరకు కరెక్ట్? ఎటువంటి నివేదికలు లేకుండానే అనేక మందికి ఈ ప్రభుత్వం సెక్యురిటీ కల్పించింది. త్రెట్టు ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సైతం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. త్రెట్టు ఉన్నవారికి ఇష్టానుసారంగా సెక్యూరిటీని తీసేస్తే కోర్టులు ఒప్పుకోవు. ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవీణ్ కుమార్‌కు కొత్త వాహనం ఇచ్చి అడిషనల్ సెక్యూరిటీ పెంచి రక్షణ కల్పించాలి అని శ్రీ‌నివాస్‌గౌడ్‌ డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో 100కు 100 శాతం బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల సెక్యూరిటీ తీసేస్తే, భవిష్యత్‌లో ఊర్లలో తిరగలేరు, ఇంట్లో ఉండలేరు అని మాజీ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement