త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | సబ్జెక్ట్ ఉండదు.. నాలెడ్జ్ అసలే ఉండదు.. నోళ్లు మాత్రం లేస్తయ్‌

Chamala Kirankumar Reddy | బీజేపీ, బీఆర్ఎస్ నాయ‌కులు స‌బ్జెక్టు లేకుండా తొంద‌ర‌పడి మాట్లాడుతున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. సీఎం రేవంత్ విదేశీ టూర్‌పై వాస్త‌వాలు తెలిసినాక మ‌ళ్లొక లైన్ తీసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Aug 23, 2026, 1.28 pm IST

Chamala Kirankumar Reddy | సబ్జెక్ట్ ఉండదు.. నాలెడ్జ్ అసలే ఉండదు.. నోళ్లు మాత్రం లేస్తయ్‌
Advertisement
  • సీఎం రేవంత్ విదేశీ టూర్‌పై వాస్త‌వాలు తెలిసినంక మ‌ళ్లొక లైన్ ఎందుకు తీసుకుంటున్న‌రు
  • ఇంజినీరింగ్ విద్యార్థుల‌ను గ్లోబ‌ల్ వేదిక‌పై నిల‌బెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ పెట్టుకున్న‌రు
  • ప్ర‌జ‌లను త‌ప్పుదోవ ప‌ట్టించే విష‌యాల‌ను ఖండించాల‌ని కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌ని కోరుతున్నా
  • భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: బీజేపీ, బీఆర్ఎస్ నాయ‌కులు స‌బ్జెక్టు లేకుండా తొంద‌ర‌పడి మాట్లాడుతున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. సీఎం రేవంత్ విదేశీ టూర్‌పై వాస్త‌వాలు తెలిసినాక మ‌ళ్లొక లైన్ తీసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స్టేట్‌మెంట్ ఇచ్చేదాక కూడా రేవంత్ ఎందుకు ఎన్క‌కు వ‌స్తుర్రో వాళ్ల‌కు తెలియ‌ద‌న్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల‌ను గ్లోబ‌ల్ వేదిక‌ల‌పై నిల‌బెట్టేందుకే సీఎం రేవంత్‌రెడ్డి లండ‌న్‌, అమెరికా టూర్ పెట్టుకున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్‌ను త‌ప్పుబ‌ట్టాల‌నే ఉద్దేశంతోనే బీజేపీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు, ఎంపీ ర‌ఘునంద‌ర్‌రావు మాట్లాడిన‌ట్లు అర్థ‌మవుతుంద‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం ఎక్స్ వేదిక‌గా మాట్లాడారు.

కాంగ్రెస్‌పై ఈర్ష్యతో, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయాలనే నీచ రాజకీయ ప్రవృత్తితో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం కాదు..
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అర్థం చేసుకుని మాట్లాడాలి. బీఆర్ఎస్, బీజేపీ వైఖ‌రి ఎలా ఉందంటే.. రాష్ట్రం అభివృద్ధి కావొద్దు, రాష్ట్రంలో ఎవ్వ‌రూ బాగుప‌డొద్దు, విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించొద్దు, పెట్టుబ‌డులు వ‌చ్చి యువ‌త‌కు ఉద్యోగాలు రావొద్దు, ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్ కావొద్దు, ఆర్ఆర్ఆర్ రావొద్దు, మూసీ బాగుప‌డొద్దు.. అనేలా ఉంది.

రేవంత్ అమెరికాలో హార్వ‌ర్డ్, ఎంఐటీ, వ‌ర్జీనియా యూనివ‌ర్సిటీల అధికారుల‌తోటి, ప్రొఫెస‌ర్ల‌తోటి మాట్లాడి రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థుల నాణ్య‌త‌ను, నైపుణ్యాన్ని పెంచి వాళ్ల‌ను గ్లోబ‌ల్ వేదిక‌పై ఉన్న‌తులుగా తీర్చిదిద్దాల‌నే సంక‌ల్పంతో లండ‌న్‌తో పాటు అమెరికా టూర్ పెట్టుకున్న‌రు. అటు బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు, ఎంపీ ర‌ఘునంద‌ర్‌రావు ఏం మాట్లాడిర్రు.. ఏదో మాట్లాడాల‌ని కాంగ్రెస్‌ను త‌ప్పుబ‌ట్టాల‌నే ఉద్దేశంతోనే మాట్లాడిన‌ట్లు క్లీయ‌ర్‌గా క‌నిపిస్తుంది.

మొద‌ట మేం అడ్డుకోలేదు అన్న‌రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో పంచాయితీలు అయితున్న‌య‌ని ఎన్క‌కు వ‌స్తుండు అని ఫ‌స్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చిర్రు. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స్టేట్‌మెంట్ ఇచ్చేదాక కూడా వాళ్ల‌కు తెల్వ‌దు రేవంత్‌రెడ్డి ఎందుకు ఎన్క‌కు వ‌స్తుర్రో. బ‌ద్నాం చేద్దామ‌నుకున్న‌రు. ప్ర‌జ‌ల‌ను, కాంగ్రెస్ పార్టీని త‌ప్పుదోవ ప‌ట్టిద్దామ‌నుకున్న‌రు.
విదేశాల‌కు ముఖ్య‌మంత్రి స్థాయిగా పోవాలి త‌ప్పా ఆయ‌న ఇష్టానుసారంగా, ఇష్ట‌మైనోళ్ల‌ను క‌ల‌వ‌నీకో.. వాళ్ల‌తోని తిర‌గ‌నీకో పోనికి లేద‌ని మ‌ళ్లా కౌంట‌ర్ ఇచ్చిర్రు. మీకు స‌బ్జెక్టే లేన‌ప్పుడు ఎందుకు మాట్లాడాలే.. వాస్త‌వాలు తెల్సుకొని మ‌ళ్లొక లైన్ ఎందుకు తీసుకోవాల‌ని అడుగుతున్నా.

కాళ్ల‌ల్ల క‌ర్ర‌లేసుడే మీ ప‌ని..

మీ ఉద్దేశంలో రేవంత్ ఏం జేసినా కాళ్ల‌ల్ల క‌ర్ర‌లెయ్యాలే. గ‌త సీఎం కేసీఆర్ 2014 కంటే ముందు హైద‌రాబాద్‌ను న్యూయార్క్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా క‌రీంన‌గ‌ర్‌ను, పారిస్ చేస్తా వ‌రంగ‌ల్‌ను అని చెప్పి గాలి మాట‌లు చెప్పిండు. ఒక్క‌రోజ‌న్నా విదేశాల‌కు పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామ‌ని లేకుండే. ఇప్పుడున్న సీఎం వాస్త‌వాలు తెలుసుకొని ప‌ని చేద్దామ‌నుకుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నరు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు, కాంగ్రెస్ ఏద‌న్నా చేస్తే అడ్డుకోవాల‌ని అనుకుంటున్న‌రు.

ముఖ్యంగా ఇద్ద‌రు మంత్రులు బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డిగారిని అడుగుతున్నా.. మీరు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రితో మాట్లాడండి. త‌ప్పేముంది మ‌న రాష్ట్రానికి విద్యా సంస్థ‌ల‌ను తీసుకొస్తే? మంచి జ‌రిగితే త‌ప్పేముంది? మిగిలిన ఎంపీల‌కు కూడా కొంచెం జ్ఞానం ఇయ్యండి. వాస్త‌వాలు ఏంటో చెప్పండి. ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుగా తీసుకెళ్లే విష‌యాల‌ను మీ ఇద్ద‌రూ ఖండించాల‌ని కోరుకుంటున్నా.

విద్య‌కు, ఉద్యోగానికి గ్యాప్‌ను ఫిల్ చేయాల‌న్న ఉద్దేశంతోటి రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండు. కాబ‌ట్టి తెలంగాణ ప్ర‌జ‌లు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఏం ప‌ని చేసినా స‌బ్జెక్టు లేకున్నా తొంద‌ర‌ప‌డి వ‌చ్చి మాట్లాడుతున్న‌ట్లు అర్థం అయితుంది అని చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement