Rambabu Yadav | సంక్షేమ రాజ్యం పోయి సమ్మెల కాలం నడుస్తోంది: రాంబాబు యాదవ్
Rambabu Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమ రాజ్యం పోయి సమ్మెల (strike) కాలం నడుస్తోందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్(Rambabu Yadav) విమర్శించారు. రాష్ట్రంలో కార్మిక వర్గాలన్నీ ఆందోళనలో ఉన్నాయన్నారు. ఆర్టీసీ (RTC) కార్మికులు ఈ నెల 22న సమ్మెకు పోతామని నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమ రాజ్యం పోయి సమ్మెల (strike) కాలం నడుస్తోందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్(Rambabu Yadav) విమర్శించారు. రాష్ట్రంలో కార్మిక వర్గాలన్నీ ఆందోళనలో ఉన్నాయన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ (RTC) కార్మికులు ఈ నెల 22న సమ్మెకు పోతామని నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే భట్టి విక్రమార్క పిలిచి ఆర్టిజెన్స్ పై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్టీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఈ ప్రభుత్వం ఎవరి సమస్యలు కూడా పరిష్కారం చేయడం లేదు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో త్రిశంకు స్వర్గం చూపించారు. ఎన్నికల తరువాత ఏం చేయడం లేదు. ఆర్టీసీ వాళ్లకు అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అన్ని రకాల వసతులు కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్ని మరిచారు అని విమర్శించారు.
అన్ని సమస్యలు పరిష్కారం చేశామని ప్రభుత్వ పెద్దలు కరపత్రం వేస్తున్నారని, బీఆర్టీయూ 32 సమస్యలతో యాజమాన్యంకు నోటీస్ ఇచ్చాం. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు అన్ని రకాల వసతులు కల్పిస్తూ భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులకు అండగా బీమా పథకం తెచ్చారు. ఆశా వర్కర్లు హైద్రాబాద్ లో ధర్నా చేస్తుంటే వాళ్లను ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా అరెస్ట్ చేశారు. చర్చల పేరు మీద పిలిచి ప్రభుత్వం బెదిరింపులు చేస్తున్నది. భేషరతుగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి అని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు.
అనుమతిచ్చి అరెస్టులు చేసే పథకం తెచ్చాడు: మారయ్య బీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి
హోం మంత్రి పదవిని దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరిస్తున్నారు. కార్మికులు చేసే సమ్మెకు వారి హక్కుల సాధనకు మేము అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి కొత్త పథకం తెచ్చాడు.. అదేంటంటే ధర్నాలకు అనుమతి ఇచ్చి అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు అనేక విషయాలు చెప్పాడు. రవాణా శాఖలో 600 కోట్ల స్కాం చేస్తున్నారు. పిట్నెస్ కు వాహనం పోతే 60 రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పుడు వేలల్లో దండుకుంటున్నారు. చేసేది లేక చివరికి వాహనదారులు కోర్టు మెట్లెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం పని చేసిన స్కాంలు తప్ప ఇంకొకటి లేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





